Home

»

Latest News

చాయురంగ్: కీరవాణి 'లేథోవిస్' మ్యూజిక్ లేబుల్ నుండి మరో సంచలనం.!

Aug 20, 2026 7:06PM

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం జరిగింది. ఈ లేబుల్ ద్వారా ఇప్పటికే నాలుగు పాటలు విడుదలై, మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన ఆదరణను పొందాయి. 

కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ లేబుల్ ద్వారా వచ్చిన తొలి గీతం 'ముమ్ముకుస్సు' వివిధ భాషలలో రావడంతో ప్రత్యేక ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన రాసింది కీరవాణి కూసింది చంద్రబోస్ అంటూ సాగే పాటకు గాయని లిప్సిక తన గాత్రం అందించారు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ 'సర్పంచ్ కూతురు' వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లేబుల్ నుండి వచ్చిన నాలుగవ పాట 'అన్‌ఫైర్ లైఫ్' ఒక వినూత్న విధంగా షార్ట్ ఫిలిం తరహాలో వచ్చింది. 

అయితే ఇప్పుడు ఈ లేబుల్ నుండి వచ్చిన 5వ పాటను ప్రముఖ మలయాళ సింగర్ సితార కృష్ణకుమార్ పాడటం విశేషం. ఆమెతో కలిసి కీరవాణి తొలిసారి వీడియోలో కనిపిస్తూ రానున్న సాంగ్ 'చాయురంగ్'. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాటకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పాటపై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ నుండి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి వచ్చిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో అంటూ అందరూ ఈ పాటపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. 

అంతేకాక ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి మరెన్నో పాటలు రానున్నట్లు, రాబోయే కొన్ని నెలలలో మరిన్ని పాటలు విడుదల కానున్నాయని తెలుస్తుంది. ఇక ఆ పాటలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి.

 

 

 

MM Keeravani, Lethowis, Chayurang Song

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com