Home

»

Latest News

Vishnu Priya: మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియ.. సరికొత్త మలుపు తిరిగిన కథ  

May 22, 2026 6:05PM

 

 

ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ(Vishnupriya)అంటే తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో పలు వివాదాలు, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ ద్వారా హాట్ టాపిక్‌గా మారిన ఆమె, తాజాగా తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటూ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెలబ్రిటీలను, ముఖ్యంగా మహిళా నటీమణులను లక్ష్యంగా చేసుకుని కొందరు చేస్తున్న అసభ్యకరమైన ప్రచారాలు, ట్రోలింగ్స్ హద్దులు దాటుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ  ప్లే లైక్ ఇంకాగ్నిటో అనే  యూట్యూబ్ ఛానల్ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తోందని విష్ణుప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై నిరంతరం అసభ్యకరమైన పోస్టులు, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో  యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు.ఈ సందర్భగా విష్ణు ప్రియ మాట్లాడుతు కేవలం వ్యూస్, సబ్‌స్క్రైబర్లని  పెంచుకోవడం కోసమే కొందరు డిజిటల్ క్రియేటర్లు పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. మా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అనరాని మాటలు అంటున్నారు. ఏడ్చి ఏడ్చి విసిగిపోయా. ఇక మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. అందుకే మౌనంగా ఉండటం కంటే చట్టం ద్వారా బుద్ధి చెప్పడమే సరైన మార్గమని భావించి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది. ఈ ఫిర్యాదుని  స్వీకరించిన మియాపూర్ పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని  ముమ్మరం చేశారు. సదరు యూట్యూబ్ ఛానెల్  ఐపీ అడ్రస్, అకౌంట్ వివరాలని  సేకరించే పనిలో సైబర్ క్రైమ్ విభాగం నిమగ్నమైంది.

Also read: Anna lezhneva: జిమ్‌లో పవన్ భార్య అన్నా లెజినోవా ఫిట్‌నెస్ సెన్సేషన్.. చిరు కామెంట్‌కి క్రేజీ రిప్లై

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com