
స్టార్ హీరోలు మమ్ముట్టి(Mammootty),మోహన్‌లాల్(Mohan lal)కలిసి చేసిన చిత్రం పేట్రియాట్(Patriot). స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా ఈ నెల 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు కలిసి నటించిన భారీ చిత్రం కావడంతో అభిమానులు, ప్రేక్షకులు భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు. కానీ మూవీ అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా రిలీజ్ కి రెడీ అయ్యింది.
ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ 'జీ5' డిజిటల్ రైట్స్‌ని సొంతం చేసుకుంది. జూన్ 5, 2026 నుండి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం వంటి 5 ప్రధాన భారతీయ భాషల్లో ఈ స్పై థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారకంగా ప్రకటించింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఓటీటీ వీక్షకులని ముఖ్యంగా మిస్టరీ, పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులని పేట్రియాట్ బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ నారాయణన్ తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ సుమారు ఒక సంవత్సరానికి పైగా ఇండియా, శ్రీలంక, లండన్, అజర్‌బైజాన్ మరియు యూఏఈ వంటి 10కి పైగా అంతర్జాతీయ దేశాల్లోని లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. సుశీన్ శ్యామ్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం, మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Also read: Vishnu Priya: మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియ.. సరికొత్త మలుపు తిరిగిన కథ
ఇండియాలో మొదటి రోజే 9.80 కోట్ల నెట్ కలెక్షన్లతో పాటు, ఓవర్సీస్ మార్కెట్‌లో 18.00 కోట్ల గ్రాస్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 29.37 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. థియేట్రికల్ రన్ మొదటి రోజుల్లో 66 శాతం అక్యుపెన్సీతో దూసుకుపోయిన ఈ చిత్రం, ఆ తర్వాత మిశ్రమ సమీక్షల వల్ల నాలుగో రోజు నాటికి కలెక్షన్లు తగ్గి 19 శాతం అక్యుపెన్సీకి పడిపోయింది. అయినప్పటికీ, మమ్ముట్టి ,మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అభిమానులు థియేటర్లకి క్యూ కట్టారు. నయనతార, ఫహద్ ఫాజిల్, సీనియర్ నటి రేవతి, కుంచకో బోబన్, దర్శన రాజేంద్రన్ రాజీవ్ మీనన్ వంటి భారీ తారాగణం కీ రోల్స్ పోషించారు.






