Home

»

Latest News

వైరల్ గా నిలిచిన అవెంచర్స్ డూమ్స్‌డే టికెట్ రేట్స్: మీరు కూడా ఈజీగా కొనేయవచ్చు! 

Nov 17, 2026 5:52PM

కొన్ని న్యూస్ ని నమ్మడం తప్ప వేరే ఛాయిస్ లేదు. ఒక వేల మంకు పట్టుపట్టి 'నమ్మం' అని బీష్మించుకొని కూర్చుంటే ఆధారాలతో సహా నిరూపించాక షాక్ తో నోరెళ్లెబెట్టాల్సిన పరిస్థితి. మరి నోరెళ్ళ బెట్టేయండి.


మార్వెల్ సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ హాలీవుడ్ చిత్రం 'అవెంచర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday) భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే, దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలను మించి దూసుకుపోతున్నాయి. నవంబర్ 17న మధ్యాహ్నం 12 గంటలకు పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లలో ఆన్‌లైన్ టికెట్ విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. 

బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్స్ మొదలైన కొద్దిసేపట్లోనే గంటకి సుమారు 10,000 టికెట్ల వరకు అమ్ముడవుతూ రికార్డు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 50,000లకు పైగా టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోవడం క్రేజ్‌కి నిదర్శనం.   ముంబై, దిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పూణే, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు.

డిసెంబర్ 17న అమెరికా కంటే ఒక రోజు ముందే భారత్‌లో గ్రాండ్‌గా విడుదల కానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 17 అర్ధరాత్రి 12:01 గంటలకు స్పెషల్ మిడ్‌నైట్ స్క్రీనింగ్‌లు, 24 గంటల షోలని కూడా ప్లాన్ చేశారు. ముంబై వంటి నగరాల్లో రెక్లైనర్ సీట్ల ధరలు 1,500 నుండి  1,990 వరకు ఉన్నప్పటికీ, క్షణాల వ్యవధిలోనే ఆ షోలు పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం విశేషం.

సాధారణ టికెట్ల ధరలు  420 నుంచి ప్రారంభమవుతున్నాయి.ముంబై, హైదరాబాద్ లాంటి అర్బన్ సిటీలతో పాటు తెనాలి లాంటి లోకల్ ప్రాంతాల్లోనూ టికెట్స్ సేల్ చేస్తున్నారు. కానీ రేట్లే.. సినీ ప్రేక్షకులకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి:భోగి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ మూవీకి పోటీ తప్పదా!

అయితే ఈ చిత్రానికి మన దేశంలో టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టగా ఏకంగా ఒక్కొక్కటి  4500 పైగానే విక్రయిస్తున్నారు. నేవి ముంబై ప్రాంతంలోని ఓ మల్టీప్లెక్స్‌లో ఈ రేట్లు దర్శనమిచ్చాయి. 500 నుంచి మొదలుపెట్టి ఒక్కో చోట ఒక్కోలా 1000,.2000, 3000 ఇలా టికెట్లని అమ్ముతున్నారు.


ఇంతటి భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert Downey Jr.) మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి (MCU) తిరిగి వస్తుండటమే. అయితే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఆయన ఈసారి టోని స్టార్క్ అనగా ఐరన్ మ్యాన్ క్యారక్టర్ లో  కాకుండా, అత్యంత శక్తివంతమైన విలన్ 'డాక్టర్ డూమ్' (Doctor Doom) రూపంలో కనిపిస్తుండటం విశేషం. 

 

ఆంథోనీ మరియు జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో క్రిస్ హేమ్‌వర్త్, క్రిస్ ఎవాన్స్, పెడ్రో పాస్కల్, ఆంథోనీ మ్యాకీ, ఫ్లోరెన్స్ ప్యూ వంటి హాలీవుడ్ దిగ్గజ నటుల పెద్ద తారాగణం నటిస్తోంది. సుమారు 1 బిలియన్ డాలర్లు అనగా భారతీయ కరెన్సీలో సుమారు 8,500 కోట్ల భారీ బడ్జెట్‌తో  రూపుదిద్దుకుంది.

భారతీయ ప్రేక్షకులని  దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా, 2D, 3D, 4DX, స్క్రీన్ఎక్స్ (ScreenX) మరియు ప్రీమియం ఇన్ఫినిటీ విజన్ (Infinity Vision Certified) వంటి అత్యాధునిక ఫార్మాట్లలో  థియేటర్లలో అనుభవించవచ్చు.

 

మీకు నచ్చవచ్చు:11000 కోట్లు కొల్లగొట్టింది!
మీకు నచ్చవచ్చు:సాయిపల్లవి హీరోయిన్ నేనా!

 

[Avengers Doomsday, Robert Downey Jr Doctor Doom, MCU India release, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com