
'పుష్ప' సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'రాకా' గురించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా.. ఇలా మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో బన్నీ అలరించబోతున్నట్లు ఇన్‌సైడ్ వర్గాల సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే త్రిపాత్రాభినయం చేయడం అనేది చాలా అరుదైన విషయం. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ ట్రిపుల్ రోల్ చేశారు. ఇక ఈ జనరేషన్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ట్రిపుల్ చేయగా.. ఇప్పుడు ఆ లిస్టులో అల్లు అర్జున్ చేరబోతున్నారట.
'పుష్ప' సినిమాలో ఒక్క పుష్పరాజ్ లుక్ అండ్ మేనరిజంతోనే దేశమంతటినీ తనవైపు తిప్పుకున్న బన్నీ... ఇప్పుడు ఒకే సినిమాలో మూడు వెరైటీ లుక్స్, డిఫరెంట్ డిక్షన్, బాడీ లాంగ్వేజ్‌తో వస్తే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం.
[Raaka Movie, Allu Arjun, Triple Role]






