
వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని J.S.R. నగర్‌లో నిర్మించిన శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి ఆలయ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్‌రాజు సతీసమేతంగా హాజరయ్యారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, శ్రీరాములు, హీరో వంశీకృష్ణ అందరి సమక్షంలో దిల్ రాజుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దిల్ రాజు ఆలయాన్ని సందర్శించి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు.
నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. పోరుమామిళ్లలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరాములు ఆహ్వానం మేరకు వచ్చాను. తమ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అంటే శ్రీరాముడే కదా. 20 సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరు, కడప, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల్లో వ్యాపారం చేశాను. శ్రీరాములు కుటుంబం గుడిని నిర్మించింది. ఇక రాములవారి సేవని, భక్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద ఉంది. . ఇంత పెద్ద మహత్తర కార్యాన్ని నిర్వర్తించిన శ్రీరాములు కుటుంబానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని దిల్ రాజు పేర్కొన్నాడు.
హీరో వంశీకృష్ణ మాట్లాడుతూ.. పిలవగానే హైదరాబాద్ నుంచి పోరుమామిళ్ళకు వచ్చిన దిల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సొంతూరులో ఆలయాన్ని నిర్మించడం మహాభాగ్యంగా భావిస్తూ ఇలాంటి ప్రోత్సాహం ఎల్లప్పుడూ గ్రామస్తులు నుంచి ఉండాలి . భక్తి మార్గంలో వెళ్తూ అందరితో ప్రేమాభిమానాలతో ఉంటూ జీవించాలని ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ స్థలధాత శ్రీరాములు మాట్లాడుతూ... మనసున్న మారాజు దిల్ రాజు. ఎంత బిజీ పనులున్నా, అమెరికా వెళ్లాల్సి ఉన్నా కూడా అన్ని పనులు క్యాన్సల్ చేసుకొని, పిలవగానే పోరుమామిళ్లలోని రామాలయ ప్రతిష్టకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ మహోన్నత కార్యక్రమంలో తనను ముందుండి నడిపించిన చెన్నకృష్ణకు, రామచంద్ర తదితరులకి హృదయపూర్వక నమస్కారాలు. దిల్ రాజు చెప్పినట్టు ఆలయం నిర్మించడమే కాదు ప్రతిరోజు నిష్టగా పూజలు చేసి స్వామివారి భక్తిని చూరగొనుటమే మన విధి. బద్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ ఇంత పెద్ద రామాలయం లేదని అందరూ చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా
Also Read: నీ శరీరం,నీ ఇష్టమే: కానీ హద్దులు ఉండాలి.. టాప్ హీరోయిన్ కి ప్రియాంక చోప్రా తల్లి చురకలు
ఈ సందర్బంగా ఈ ప్రతిష్ఠా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులందరికీ ఉచిత అన్నదాన సేవ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని పెద్దలు, కుటుంబాలు, యువతతో పాటు రాబోయే తరాలను కూడా ఒకచోట కలిపే ఆధ్యాత్మిక వేదికగా శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారి ఆలయం అని, ఇలాంటి గొప్ప ఆలయాన్ని నిర్మించిన దాతలు జడపోలు శ్రీరాములు- హైమావతి, వంశీకృష్ణతో పాటు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
Dil Raju, Sri Pattabhi Ramachandra Temple, TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood, Tollywood News






