Home

»

Latest News

అల్లు అర్జున్ ‘రాకా’: గందరగోళానికి కారణమేంటి.?

Sep 30, 2026 11:54AM

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.

‘రాకా’ను ఒకే భాగంగా కాకుండా రెండు భాగాలుగా తీసుకొచ్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

‘రాకా’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయితే.. మొదటి భాగాన్ని 2027 డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

అలా కాకుండా సినిమాను ఒకే భాగంగా విడుదల చేయాలని నిర్ణయిస్తే మాత్రం.. పూర్తి సినిమాను 2028లో రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అంటే ‘రాకా’ విడుదల ఎప్పుడు అనేది.. సినిమా రెండు భాగాలుగా వస్తుందా? లేదా ఒక్క భాగంతోనే కథను ముగిస్తారా? అనే నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నమాట.

భారీ కథ, పెద్ద క్యాన్వాస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తే కథకు మరింత స్పేస్ దొరుకుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అదే సమయంలో ఒకే భాగంగా తీసుకురావడం వల్ల కథను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం.

దీంతో రెండు భాగాలుగా చేయాలా? లేక ఒకే సినిమాగా పూర్తి చేయాలా? అనే విషయంలో చిత్రబృందం ప్రస్తుతం తర్జన భర్జనలు పడుతున్నట్లు టాక్.

ఇది కూడా చదవండి: డ్రాగన్ రిలీజ్ డేట్.. వాయిదాపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.!

 

 

 

[Allu Arjun Raaka Movie, Raaka Release Date, Raaka Movie Two Parts, Raaka Release Plan, Allu Arjun Atlee Movie, Icon Star Allu Arjun, Allu Arjun New Movie, Telugu Film News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com