హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో టికెట్ల బుకింగ్ విషయంలో ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు డాల్బీ స్క్రీన్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండటం లేదని కొందరు సినీ అభిమానులు ఆరోపించారు. తాజాగా ఈ విషయాన్ని నేరుగా నిర్మాత అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు.
నవంబర్ 20న విడుదలైన దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రదర్శన అనంతరం అల్లు అరవింద్ థియేటర్ నుంచి బయటకు వస్తుండగా కొందరు ప్రేక్షకులు ఆయనను కలిశారు. షో ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు వరకు ఎక్కువ టికెట్లను బ్లాక్ చేసి ఉంచుతున్నారని, కేవలం కింది నాలుగు వరుసల సీట్లు మాత్రమే బుకింగ్‌కు అందుబాటులో ఉంటున్నాయని వారు వివరించారు. మిగిలిన సీట్లు చివరి నిమిషంలో విడుదల చేస్తున్నారని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రేక్షకుల ఫిర్యాదును విన్న అల్లు అరవింద్ అక్కడికక్కడే తన థియేటర్ సిబ్బందికి వీడియో కాల్ చేశారు. సమస్యను నేరుగా వివరించాలని అక్కడున్న వారిని కోరారు. అనంతరం ఈ వ్యవహారాన్ని తానే పర్యవేక్షిస్తానని, రెండు వరుసలు మినహా మిగిలిన అన్ని సీట్లను సాధారణ ప్రేక్షకుల బుకింగ్ కోసం విడుదల చేయాలని సిబ్బందికి సూచిస్తానని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: హిట్లు, ఫ్లాపులతో సాగిన ప్రయాణం.. నాగచైతన్య కెరీర్లో ఆసక్తికర విశేషాలివే.!
అల్లు అరవింద్ ప్రేక్షకులతో మాట్లాడి సిబ్బందికి సూచనలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టికెట్ల బుకింగ్‌పై వచ్చిన ఫిర్యాదుకు ఆయన వెంటనే స్పందించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ ‘ఎమ్మెస్: యాన్ ఆన్-స్క్రీన్ లెగసీ’ నిర్మాణంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు.
నిత్యమేనన్ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే!
డింపుల్ హయతికి క్షమాపణలు చెప్పిన సంపత్ నంది!
[Allu Aravind, AlluCinemas, AlluCinemasHyderabad, AakasamloOkaTara, DulquerSalmaan]





