Home

»

Latest News

ఒక్క హిట్.. భార్య పైనే భారం వేసిన నితిన్.!

Aug 3, 2026 10:51AM

2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత హీరో నితిన్ బాక్సాఫీస్ దగ్గర హిట్ చూడలేదు. సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నితిన్.. గతేడాది వచ్చిన 'తమ్ముడు' సినిమాతోనూ నిరాశపరిచాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని, కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్యపై భారం వేశాడు. "నా భార్య.. నా వైఫ్" అంటూ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు.

న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా ఒక సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాని సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు.

ఈ చిత్రానికి 'అలియాస్ రుక్మిణీ' అనే డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేస్తూ.. తాజాగా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. నాని వాయిస్ తో రూపొందించిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. "దేని గురించి ఈ కథ" అని నాని అడగగా.. "కృష్ణ గురించి" అని దర్శకుడు చెప్తాడు. కానీ, స్క్రీన్ మాత్రం రుక్మిణి పేరుతో పలు పుస్తకాలు దర్శనమిస్తాయి. 

దాంతో "ఇది కృష్ణ కథ అన్నావ్. అసలు ఈ రుక్మిణీ ఎవరు?" అని నాని అడుగుతాడు. పుస్తకాల దగ్గర పడుకొని ఉన్న నితిన్.. నిద్ర లేచి, కళ్లద్దాలు పెట్టుకొని "నా భార్య.. నా వైఫ్" అని చెబుతాడు. 

'అలియాస్ రుక్మిణీ' టైటిల్ గ్లింప్స్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా ఉంది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఈ గ్లింప్స్ కి మరింత అందాన్ని తీసుకొచ్చింది.

త్వరలోనే  'అలియాస్ రుక్మిణీ' షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో నితిన్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

Alias Rukmini, Title Glimpse, Nani, Nithiin

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com