Home

»

Latest News

ఆ రూమర్స్ నమ్మకండి: అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇదే.!

Aug 10, 2026 4:30PM

రీసెంట్ గా 'లెనిన్' సినిమాతో అఖిల్ అక్కినేని బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అఖిల్ నెక్స్ట్ మూవీపై అక్కినేని అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. "అఖిల్ ఆ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడంట...", "ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ప్రాజెక్ట్ ఓకే అయిందంట..." అంటూ రకరకాల గాసిప్స్ ప్రచారం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ.. అక్కినేని టీమ్ కీలక ప్రకటన చేసింది. "అఖిల్ ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి వస్తున్న రూమర్స్ ని నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని కోరుతున్నాము. అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది." అని తెలిపారు. 

అఖిల్ తన నెక్స్ట్ మూవీ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని, ప్రతీ పాయింట్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది.

 

 

Akhil Akkineni, Next Movie, Akkineni Fans, Lenin Movie

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com