Home

»

Latest News

అప్పుడు 'లెజెండ్'.. ఇప్పుడు 'అఖండ‌'..! అదే ప‌రిస్థితి!!

Nov 28, 2021

 

మాస్ ఎంట‌ర్టైన‌ర్స్ ని రూపొందించ‌డంలో స్టార్ కెప్టెన్ బోయ‌పాటి శ్రీ‌ను తీరే వేరు. అందుకే.. బోయ‌పాటి ఖాతాలో అప‌జ‌యాల కంటే విజ‌యాలే ఎక్కువ‌. `భ‌ద్ర‌`, `తుల‌సి`, `సింహా`, `లెజెండ్`, `స‌రైనోడు`.. ఇలా సాలిడ్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందించిన వైనం బోయపాటి సొంతం. ఇక ఇదే బోయ‌పాటి.. `ద‌మ్ము`, `జ‌య జాన‌కి నాయ‌క‌`, `విన‌య విధేయ రామ‌` వంటి ఫ్లాప్స్ ని కూడా త‌న ఖాతాలో వేసుకున్నారు. క‌ట్ చేస్తే.. ఈ డిసెంబ‌ర్ 2న `అఖండ‌`తో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు శ్రీ‌ను. ద‌ర్శ‌కుడిగా త‌న‌కిది తొమ్మిదో చిత్రం కావ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. త‌న ల‌క్కీ హీరో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ త‌రువాత బోయ‌పాటి తీసిన‌ `అఖండ‌`పై స్కై హై ఎక్స్ పెక్టేష‌న్స్  నెల‌కొన్నాయి. `విన‌య విధేయ రామ‌` వంటి డిజాస్ట‌ర్ త‌రువాత బోయ‌పాటి నుంచి వ‌స్తున్న సినిమా అయిన‌ప్ప‌టికీ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉండ‌డానికి ఈ కాంబో ట్రాక్ రికార్డ్ నే మెయిన్ రీజ‌న్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

Also read:  శివశంకర్ మాస్టర్‌తో నాకు మంచి అనుబంధం!

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన రెండో చిత్రం `లెజెండ్`కి ముందు కూడా `ద‌మ్ము` రూపంలో బోయ‌పాటికి ప‌రాజ‌యం ఉంది. మ‌రి.. సెంటిమెంట్ రిపీట్ అయి `ద‌మ్ము` త‌రువాత వ‌చ్చిన `లెజెండ్` ఎలాగైతే సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో.. అలాగే `విన‌య విధేయ రామ‌` అనంత‌రం వ‌స్తున్న `అఖండ‌` కూడా సంచ‌ల‌నం సృష్టించి బోయ‌పాటి ఖాతాలో మ‌రో మెమ‌ర‌బుల్ హిట్ చేరుతుందేమో చూడాలి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com