
కొన్ని కాంబోలలో తెరకెక్కే చిత్రాలు చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత సినీ ప్రియుల్లో, అభిమానుల్లో చాలా బలంగా ఉంటుంది. అలాంటి ఒక కాంబో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గతంలో ఈ ఇద్దరి కాంబోలో (రైటర్ గా త్రివిక్రమ్) వచ్చిన సినిమాల్లోని డైలాగ్స్ నేటికీ ప్రతి నిమిషం మారుమోగిపోతుంటాయి. దీంతో వెంకటేష్ తో త్రివిక్రమ్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న “ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47” (AK 47). తో అంచనాల స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపించాయి.
కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ డెడ్‌లైన్‌ని అందుకోవడం కష్టమేనన్న సరికొత్త గాసిప్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అనుకున్న సమయానికి ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని, విడుదల వాయిదా పడే అవకాశాలు 90 శాతానికి పైగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. షూటింగ్‌లో కొన్ని ఊహించని అవాంతరాలు ఎదురయ్యాయని, అందువల్లే ఈ ఆలస్యం జరుగుతోందని సమాచారం. ఇటీవల విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా కథాంశం, ‘ఆదర్శ కుటుంబం’ లైన్ దాదాపు ఒకేలా ఉండటంతో త్రివిక్రమ్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఒక డాన్ లేదా అస్సాసిన్ కుటుంబం సమాజానికి దూరంగా సాధారణ జీవితం గడుపుతూ, లోకల్ లీడర్ వల్ల మళ్లీ ఆయుధం పట్టాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే క్రైమ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను ప్లాన్ చేశారు. అయితే కథాంశంలో పోలికలు రాకుండా ఉండేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసి, దాదాపు 30 శాతం వరకు ముఖ్యమైన సీన్లను రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ రీషూట్ ప్రక్రియ కారణంగా అక్టోబర్ 2 నాటికి షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడం అసాధ్యంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: విజయ్ కి షాక్ ఇచ్చిన త్రిష.. ఇక బ్రేక్ అప్ అయినట్టేనా!
దసరా లాంగ్ వీకెండ్ హాలిడే సీజన్ అడ్వాంటేజ్‌ని మేకర్స్ మిస్ చేసుకుంటే, ఈ ఏడాదిలో మరో మంచి డేట్ దొరకడం చాలా కష్టం. దీంతో అక్టోబర్ రిలీజ్ మిస్ అయితే, 2027 సమ్మర్ సీజన్ కి వచ్చే అవకాశాలు ఉన్నారనేది సినీ సర్కిల్స్ లో తాజాగా చక్కర్లు కొడుతున్న న్యూస్. వెంకీ ఫ్యాన్స్ మాత్రం రిలీజ్ వాయిదా విషయంలో కంగారు పడుతున్నారు.






