Home

»

Latest News

ఢిల్లీ హైకోర్టుకి ఐశ్వర్య రాయ్.. ఆమె దారిలోనే పలువురు హీరోయిన్లు!

Sep 9, 2025 4:10PM

భారతీయ సినీ పరిశ్రమకి ఎనలేని సేవలందించిన నటీమణుల్లో 'ఐశ్వర్యరాయ్'(AIshwarya)ఒకరు. లవ్, యాక్షన్, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల వేరియేషన్స్ ని అద్భుతంగా ప్రదర్శించడంలో తిరుగులేని నటి. హీరోలతో పాటు సమానమైన స్టార్ స్టేటస్ ఆమె సొంతం. ప్రపంచమే తన వైపు చూసేలా 'మిస్ వరల్డ్'(Miss World)గా కూడా నిలిచి మన దేశానికి కీర్తి ప్రతిష్టతలు తీసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలకి విరామం ప్రకటించినా, తను మాత్రమే చేయగలిగిన క్యారక్టర్ అని మేకర్స్  భావించినప్పుడు 'పొన్నియన్ సెల్వం' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

రీసెంట్ గా ఐశ్వర్యరాయ్ 'ఢిల్లీ హైకోర్టు'(Delhi High Court)ని ఆశ్రయించింది. ఆమె తరపు లాయర్ కోర్టులో వాదిస్తు' ఐశ్వర్య రాయ్ గారి ఫోటోలని కొంత మంది మార్ఫింగ్ చేసి తమకి అనువుగా ఉపయోగించుకుంటున్నారు. ఆమె ప్రతిమని టీ షర్ట్ లపై కూడా ముద్రించి అమ్ముకుంటు డబ్బులు సంపాదిస్తున్నారు. కొన్నియూ ట్యూబ్ చానల్స్ 'ఏఐ'(AI)టెక్నాలజీతో ఐశ్వర్య చిత్రాలని క్రియేట్ చేసి అసభ్య వీడియోలు చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా ఆమె చిత్రాలని ఉపయోగించుకునే అధికారం ఎవరికీ లేదు. ఈ మేరకు ఆమెకి అనుకూలంగా  తీర్పు ఇవ్వాలని న్యాయవాది కోర్టుకి విన్నవించాడు.

విచారణ జరిపిన న్యాయస్థానం ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా వ్యక్తులైనా, సంస్థలైనా ఆమె ఫోటోలు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 15 న  జరగనుండగా,ఐశ్వర్యరాయ్ దారిలోనే మరికొంత మంది సినీ తారలు కోర్టుకి వెళ్లనున్నట్టు సమాచారం.  


 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com