
సెన్సార్ బోర్డ్ రూపంలో ఐష్, రణబీర్ కపూర్ నటించిన ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐష్, రణబీర్ ల మధ్య రొమాన్స్ శృతి మించిందని.. మూడు సీన్లను కత్తెరించింది. దీంతో ఇప్పటికే డైరెక్టర్ కరణ్ జోహర్.. ఈసినిమాలో ఆ మూడు సీన్లే ముఖ్యమని.. అవి కాస్త సెన్సార్ బోర్డ్ కత్తిరించిందని బాధపడుతుంటే..ఇప్పుడు మరో షాక్ ఎదురైంది. ఇప్పుడు పాక్ నటుడు ఫవాద్‌ఖాన్ రూపంలో తలనొప్పి స్టార్ అయింది. ఉరీ కాల్పుల అనంతరం పాక్ నటులు పాక్ వెళ్లిపోవాలని డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో ఫవాద్‌ఖాన్ కూడా ఉండటంతో.. పలు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు పాక్ నటీనటులున్న సినిమాలను ఆడనివ్వమని తేల్చిచెప్పేశారు. ఈ కారణంగా చాలా థియేటర్లలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో కరణ్ ఆందోళన చెందుతున్నాడు. అంతేకాదు ఉగ్రవాదానికి పాక్ నటీనటులకు సంబంధం లేదని వారిని భారత్ నుంచి వెళ్లగొట్టినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదని చెబుతున్నాడు. మరి కరణ్ మాటల్ని వింటారో లేదో చూడాలి..






