Home

»

Latest News

దీపావ‌ళి రేసులో `ఆది పురుష్`!?

Feb 16, 2022 4:23PM

త‌న కెరీర్ లోనే తొలిసారిగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న మైథ‌లాజిక‌ల్ ఫిల్మ్ `ఆది పురుష్`. ఇందులో శ్రీ‌రాముడి పాత్ర‌లో క‌నిపించనున్నారు ఈ ఉప్ప‌ల‌పాటి వారి హ్యాండ్సమ్ హీరో. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ప్ర‌భాస్ కి జంట‌గా, `సీత‌` పాత్ర‌లో కృతి స‌న‌న్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుండ‌గా.. రావ‌ణాసురుడి వేషంలో మెస్మ‌రైజ్ చేయ‌నున్నారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో స‌న్నీ సింగ్, దేవ‌ద‌త్త నాగే, వ‌త్స‌ల్ సేథ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. తొలుత ఈ సినిమాని 2022 ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు అదే తేదికి మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో న‌టించిన `లాల్ సింగ్ చ‌ద్ధా` రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో.. దీపావ‌ళి సీజ‌న్ లో `ఆది పురుష్`ని విడుద‌ల చేసే దిశ‌గా యూనిట్ ప్లాన్ చేస్తోంది. బ‌హుశా అక్టోబ‌ర్ 21న ఈ చిత్రం జ‌నం ముందుకు రావ‌చ్చ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే `ఆది పురుష్` న‌యా రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Also Read: బాల‌య్య‌తో మ‌రోసారి మీరా జాస్మిన్!?

కాగా  టి-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆది పురుష్`కి సాచేత్ - ప‌రంప‌ర స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com