సీనియర్ నటి శారద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా అగ్ర కథానాయికగా వెలుగొందిన శారద.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో కీలక పాత్రలు పోషించారు. అయితే వయసు పెరగడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా బయట కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి శారద హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా ఆమె నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించడంతో అక్కడ తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శారదను ఇలా చూడటంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫొటోల ఆధారంగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారణకు రావడం మాత్రం సరికాదు.
శారద గతంలో ఎన్నో మరపురాని పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా తల్లి, అత్త, ఇతర కీలక పాత్రల్లోనూ తన నటనతో మెప్పించారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఆమెకు ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కూడా ఆమె ఓ వివాహ వేడుకలో కనిపించగా.. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఆమెను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శారద చాలా అరుదుగా మాత్రమే బయట కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో ఆమె కనిపించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అభిమానులు మరోసారి ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సీనియర్ నటి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
[Actress Sarada, Senior Actress Sarada, Sarada Latest Photos, Actress Sarada Viral Photos, Sarada Latest Viral Photos, Telugu Actress Sarada, Sarada Photos, Senior Actress Latest News]




