
రాధ.. అంబిక.. ఈ ఇద్దరి సిస్టర్స్ సౌత్ సినీ ప్రపంచంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు, ముఖ్యంగా తెలుగు సినీ జగత్తులో రాధ సృష్టించిన 'ఆరా' అపారం. చిరంజీవితో చేసిన చిత్రాలైతే ఎవర్ గ్రీన్. తాజాగా రాధ తన అనుమతి లేకుండా సంతకం చేసిన పాత ఖాళీ చెక్కులని దొంగిలించి, వాటి ద్వారా ఏకంగా 46 కోట్లు కాజేసేందుకు కుట్ర పన్నారంటూ అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్ కుంజన్ నాయర్‌లపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పెద్ద సంచలనంగా మారింది.
మరొకవైపు, నటి రాధ చేసిన తీవ్రమైన ఆరోపణలని సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున్ వర్గాలు ఖండించాయి. అంబిక మాట్లాడుతు 'నాపై వచ్చిన ఈ చెక్కుల దొంగతనం, మోసం ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు. రాధ చెప్తున్న మాటలు నమ్మకండి రాధతో తమకు ఉన్న ఆస్తి సంబంధిత లావాదేవీలు, పాత ఒప్పందాల నేపథ్యంలో చెక్కులు తనే ఇచ్చింది. ఒక వేళ రాధ ఇచ్చిన చెక్కులు బ్యాంకు లో తిరస్కరణకి గురైతే నేనే పోలీసులకి రాధపై ఫిర్యాదు చేస్తానని అంబిక చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా అక్కా చెల్లెలి అనుబంధం జన్మ జన్మలా సంబంధమంటూ ఎన్నో సార్లు ఎంతో అనురాగాన్ని కురిపించుకుంటూ ప్రేమని వ్యక్తం చేస్తూ మీడియా సాక్షిగా మాట్లాడిన ఈ సినీ సిస్టర్స్ డబ్బు విషయంలో మాత్రం పోలీస్ స్టేషన్ కి ఎక్కడం చూస్తూనే డబ్బుకి ఉన్న విలువని మరో సారి ప్రపంచానికి తెలియచేసినట్లయింది.
ఇది కుడా చదవండి: ఎందుకింత క్రేజ్: 'ప్యారడైజ్' హౌస్‌ఫుల్ బుకింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!

ఈ వివాదానికి సంబంధించి రాధ వెర్షన్ ప్రకారం, రాధ ‘ARS గార్డెన్ స్టూడియో’ పేరిట ఐడీబీఐ ప్రైవేట్ బ్యాంకులో ఒక కరెంట్ ఖాతాను నిర్వహిస్తుండేవారు. తరచుగా షూటింగ్‌లు, ప్రయాణాల వల్ల నగరంలో లేని సమయంలో తోటల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, పన్నులు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల కోసం ముందే సంతకాలు చేసిన 5 నుండి 6 ఖాళీ చెక్కులను చెన్నైలోని తన నివాసంలోని గదిలో భద్రపరుచుకునేవారు. అయితే, జనవరి 2025లో తన వ్యాపారం పేరును ‘RR గార్డెన్స్’గా మార్చి, కొత్త చెక్ బుక్ పొందడంతో ఆ పాత ఐడీబీఐ ఖాతా వాడకాన్ని, పాత చెక్కులను పూర్తిగా నిలిపివేశారు. దాంతో ఇంట్లోని ఆ పాత సంతకం చేసిన చెక్కుల విషయాన్ని ఆమె కాలక్రమేణా మరిచిపోయారు.
అయితే, సెప్టెంబర్ 17న బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన ఒక సందేశం రాధను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె పాత బ్యాంకు ఖాతాకు చెందిన ఐదు పాత చెక్కుల ద్వారా అంబిక పేరిట ఏకంగా.46 కోట్ల నగదును డ్రా చేయడానికి డిపాజిట్ చేసినట్లు ఆ మెసేజ్‌లో ఉంది. ఆ భారీ మొత్తాన్ని చూసి షాకైన రాధ, వెంటనే అప్రమత్తమై ఆ చెక్కుల చెల్లింపులను నిలిపివేయాలని (స్టాప్ పేమెంట్) బ్యాంకు అధికారులని ఆదేశించారు. తన అక్క అంబికతో గానీ, సోదరుడితో గానీ అంతటి భారీ మొత్తంలో చెల్లించేలా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని, ఆ చెక్కులను తాను స్వయంగా ఎప్పుడూ ఎవరికీ ఇవ్వలేదని రాధ స్పష్టం చేసింది.
మీకు నచ్చవచ్చు:
గురుతుందా: జ్ఞాపకాల వానలో.. శ్వాసనంటిన మధుర కావ్యం.!
జయ జయ శుభకర వినాయక: ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.!
[Radha, Ambika, Ambika About Radha Files Cheque Fraud Case, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






