'లవ్ స్టోరీ' ఈవెంట్‌కు ఆద్యంతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ఆమిర్ ఖాన్!
on Sep 19, 2021
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ 'లవ్ స్టోరి' ప్రి రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా మెరిశారు. మరో చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి, ఆమిర్‌ను ఒకే స్టేజ్ మీద చూడ్డం ఫ్యాన్స్‌కు పండగలా అనిపించింది. ఆమిర్ లేటెస్ట్ ఫిల్మ్ 'లాల్ సింగ్ చడ్ఢా'లో నాగచైతన్య ఒక కీలక పాత్ర చేశాడు. దాంతో చైతూ ఫిల్మ్ 'లవ్ స్టోరి' ఈవెంట్‌కు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆమిర్. స్టేజి కింద కానీ, స్టేజి మీద కానీ అందరి కళ్లూ ఆమిర్ మీదే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒక తెలుగు సినిమా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఆమిర్ రావడం ఇదే తొలిసారి కావడంతో ఇది ప్రత్యేకత సంతరించుకుంది. చిరంజీవి చివరి దాకా ఉండకుండా, తన స్పీచ్ అయ్యాక వెళ్లిపోయినా, ఆమిర్ మాత్రం ఈవెంట్ మొదట్నుంచీ చివరి దాకా ఉండటం గమనించదగ్గ విషయం.
ఆమిర్‌కు తెలుగు రాదు కాబట్టి తను ఏ భాషలో మాట్లాడాలో ఆడియెన్స్‌ను అడిగి హిందీలో మాట్లాడారు. ఈ ఈవెంట్‌కు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. "మూడు నాలుగు రోజుల క్రితం 'లవ్ స్టోరి' ట్రైలర్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడే చైతూకు బాగుందని మెసేజ్ పెట్టాను. ఈరోజు ఈవెంట్ ఉందని తను చెప్పాడు. ఈవెంట్ రావాలని ఉందని అతనికి చెప్పాను. నేను, చైతూ కలిసి నా సినిమాలో పనిచేశాం. చైతూకు ఫ్యామిలీ ఉన్నా, అతినికి అతిపెద్ద ఫ్యామిలీ ఫ్యాన్స్. చైతూతో కలిసిన పనిచేయడం నాకు చాలా బాగనిపించింది. అతను చక్కని యాక్టర్, చక్కని మనిషి. అతను ఒక ప్రత్యేకమైన మనిషి. అతని తల్లిదండ్రుల కారణంగా మనముందుకు ఇలాంటి మంచి మనిషి వచ్చాడు. అతని పేరెంట్స్‌కు మొదట థాంక్స్ చెప్పాలి" అన్నారు.
ఈనెల 24న 'లవ్ స్టోరి' విడుదలవుతున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పిన ఆయన తాను కూడా ఆ సినిమాని అదే రోజు చూడ్డానికి కుతూహలంగా ఎదురుచూస్తున్నాని తెలిపారు ఆమిర్. "అది కూడా థియేటర్లోనే చూడాలనుకుంటున్నా. ప్రస్తుతం మహారాష్ట్రలో థియేటర్లు ఓపెన్ కాలేదు. ప్రైవేట్ స్క్రీనింగ్‌కు అనుమతి ఇస్తే తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూస్తాను. డైరెక్టర్ శేఖర్ గురించి ప్రతి ఒక్కరూ ప్రేమగా మాట్లాడటం ఆనందం కలిగించింది. సాయిపల్లవిని కలుసుకోవడం సంతోషంగా ఉంది. తన సినిమాలు చూడలేదు కానీ, యూట్యూబ్‌లో తన పాటలు చూశాను. సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను." అన్నారు ఆమిర్ ఖాన్.
Also Read