Home

»

Latest News

అంబానీతో కత్రినా డేటింగ్..?

Nov 9, 2016 2:08PM

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు, పారిశ్రామిక ప్రముఖులతో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరికి వ్యాపార పరిచయాలు..మరికొందరికి పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి. చాలా మంది పారిశ్రామికవేత్తలు హిందీ భామల్ని పెళ్లి చేసుకున్న ఉదంతాలు బోలెడు. తాజాగా ఒక స్టార్ హీరోయిన్, ఇండియాలోనే అత్యంత సంపన్నుడి కుమారుడితో ప్రేమాయణం నడుపుతోందన్న వార్త ఇప్పుడు బీ-టౌన్‌లో హల్‌చల్ సృష్టిస్తోంది. ఆ కుమారుడు..ఎవరి కుమారుడో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ..ఆ హీరోయిన్ కత్రినా కైఫ్. ఇలాంటి పుకారు వెలుగులోకి రావడానికి కారణం అమితాబ్ ఇంట్లో జరిగిన పార్టీ.

దీపావళిని పురస్కరించుకుని బిగ్‌బి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు..దీనికి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీకి ఆకాశ్ అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో వచ్చారట. ఆ తర్వాత అనిల్ కపూర్ ఇంటికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కత్రినా రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది. అయితే అది బ్రేకప్ అయ్యింది. ఇక్కడ కొసమెరుపు ఎంటంటే అనిల్ కపూర్ ఇంట్లో పార్టీకి రణ‌బీర్ కూడా వచ్చాడట..కానీ కత్రినా మీడియా కంటపడకుండా ఆకాశ్‌తో చెట్టాపట్టాలెసుకుని తిరిగినట్లు బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com