
కొన్ని చిత్రాల ప్రచార చిత్రాలు చూస్తుంటేనే సదరు మూవీ అలా వచ్చి వెళ్లడమే కాదు.. మన మనసులో గట్టిగానే తిష్ట వేస్తుందని అనిపిస్తుంది. అలాంటి ఆనవాళ్లు 'ఆకాశంలో ఒక తార' లో కనపడుతున్నాయనే మాట సినీ సర్కిల్స్, ప్రేక్షకుల్లో వినపడుతూ ఉంది. మేకర్స్ లక్ష్యం కూడా అదే అనే విషయం ప్రీ రిలీజ్ తర్వాత చాలా స్పష్టంగా వినపడుతుంది
పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందిన ఆకాశంలో ఒక తార ఈ నెల 20 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు, అలాగే సెన్సార్ బోర్డు నుండి వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.
ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి ఈ చిత్రానికి క్లీన్ 'యు/ఎ' (U/A) సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 160 నిమిషాల (2 గంటల 40 నిమిషాలు) నిడివితో రూపొందిన ఈ చిత్రంలో భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, స్ఫూర్తిదాయక సన్నివేశాలు అద్భుతంగా పండాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. 2 నిమిషాల 27 సెకన్ల నిడివి గల ట్రైలర్ కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్తితో మొదలై, ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది.

సాంకేతికంగా కూడా ఈ సినిమాకు అత్యున్నత స్థాయి నిపుణులు పనిచేశారు. రెండుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను, అంతరిక్ష కలల దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. జాతీయ అవార్డు గ్రహీత కె.ఎల్. ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్ బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇది కూడా చదవండి: ENE రిపీట్ ఫస్ట్ రివ్యూ ఇదే!
ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ కథ ప్రతి మహిళ కలను నిజం చేసే అద్భుతమైన చిత్రమని ప్రశంసించారు. మొత్తం మీద, మనసును హత్తుకునే కథ, దుల్కర్ సల్మాన్ నటన, జి.వి. ప్రకాశ్ సంగీతంతో 'ఆకాశంలో ఒక తార' బాక్సాఫీస్ వద్ద మరో క్లాసిక్ హిట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కథ విషయానికి వస్తే, ఇది ఒక సామాన్య గ్రామీణ నేపథ్యం నుండి అంతరిక్ష కలల దిశగా సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. తెలుగు రాష్ట్రాల్లోని ఒక చిన్న పల్లెటూరికి చెందిన కల్పన అనే యువతి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని. చదువులో చురుకైన కల్పనకు వ్యోమగామి (ఆస్ట్రోనాట్) కావాలనేది జీవిత ఆశయం. కానీ ఆ ఊరిలో చాలా మంది ఆమె కలను చూసి ఎగతాళి చేస్తారు, కొందరికైతే అసలు ఆస్ట్రోనాట్ అంటే ఏంటో కూడా తెలియదు. కుటుంబ సభ్యులు, సమాజం ఆమె ప్రతిభను గుర్తించకపోగా, ఆమె ఆశయాలను నిరుత్సాహపరుస్తూ పెళ్లి చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి భర్తగా కృష్ణ అడుగుపెడతాడు.

భార్య కలను తన కలగా భావించి, ఆమె ఆశయాన్ని నిజం చేయడానికి కృష్ణ చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒక పరిపూర్ణమైన, భార్యకు అండగా నిలిచే 'గ్రీన్ ఫారెస్ట్' భర్తగా ఒదిగిపోయారు. కల్పన పాత్రలో నూతన నటి సాత్విక వీరవల్లి పరిచయమవుతున్నారు. తన సహజమైన నటన, అమాయకత్వంతో సాత్విక తొలి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా కనిపిస్తున్నారు. వీరి ప్రయాణంలో నాసా (NASA) ఉద్యోగిని రోహిణిగా శృతి హాసన్ ఒక కీలక మలుపుగా నిలుస్తారు. రోహిణితో కృష్ణ పరిచయం కల్పనను తన లక్ష్యానికి ఎలా చేరువ చేసిందనేది అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించారు.
మీకు నచ్చవచ్చు:రామాయణ కలెక్షన్ల తుఫాన్!
మీకు నచ్చవచ్చు:అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలో ఆ స్టార్ హీరో!
[Aakasamlo Oka Tara, Dulquer Salmaan, Satvika Veeravalli, Pawan Sadineni]





