Home

»

Latest News

వెంకీతో శివ నిర్వాణ ఫ్యామిలీ డ్రామా!?

Jan 20, 2022 1:54PM

`నిన్ను కోరి`, `మ‌జిలీ`, `ట‌క్ జ‌గ‌దీశ్` చిత్రాల‌తో ఫ్యామిలీ డ్రామాల స్పెష‌లిస్ట్ గా ప్ర‌త్యేక గుర్తింపు పొందాడు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. వీటిలో `నిన్ను కోరి`, `మ‌జిలీ` సినిమాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. అయితే, ఓటీటీలో స్ట్రీమ్ అయిన `ట‌క్ జ‌గ‌దీశ్`కి మాత్రం మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్లాన్ చేసుకున్న శివ నిర్వాణ‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ కంటే ముందే మ‌రో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడ‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ తో శివ నిర్వాణ నెక్స్ట్ వెంచ‌ర్ ఉంటుంద‌ని తెలిసింది. అంతేకాదు.. వెంకీ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టే ఇదో ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ఓ ప్ర‌ముఖ నిర్మాత ప్రొడ్యూస్ చేయ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే వెంకీ - శివ నిర్వాణ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రానున్న‌ది.

 మ‌రి.. వెంకటేశ్ మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌కి `మజిలీ` రూపంలో మెమ‌ర‌బుల్ హిట్ ని అందించిన శివ నిర్వాణ‌.. వెంకీకి కూడా గుర్తుండిపోయే సినిమాని అందిస్తాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com