Home

»

Latest News

అప్పుడు నిర్మాణం.. ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం..

Feb 19, 2022

`శేషు`, `ఔను.. వాళ్ళిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు`, `క‌బ‌డ్డీ.. క‌బ‌డ్డీ..`, `వ‌సంతం`, `పెద‌బాబు`, `ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌`, `ల‌క్ష్యం`, `లెజెండ్`, `టాక్సీవాలా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన న‌టి క‌ళ్యాణి. కేవ‌లం క‌థానాయిక పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా అభిన‌యానికి ప్రాధాన్య‌మున్న వేషాల్లోనూ క‌నిపించి మురిపించింది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. మాతృభాష మ‌ల‌యాళంతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిగా త‌న‌దైన ముద్ర‌వేసింది క‌ళ్యాణి.

ఇదిలా ఉంటే, ఆ మ‌ధ్య `ఛాప్ట‌ర్ 6` (2009) చిత్రాన్ని నిర్మించిన క‌ళ్యాణి.. త్వ‌ర‌లో ద‌ర్శ‌కురాలి అవ‌తార‌మెత్త‌నుంద‌ట‌. అంతేకాదు.. ఈ చిత్రాన్ని త‌నే స్వ‌యంగా నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. `రాజు గారి గ‌ది`, `మంత్ర 2` చిత్రాల్లో న‌టించిన చేత‌న్ చీను క‌థానాయ‌కుడిగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని టాక్. అలాగే తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ - సౌత్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్ద‌నున్నార‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

మ‌రి.. నిర్మాత‌గా స‌క్సెస్ చూడ‌లేక‌పోయిన క‌ళ్యాణి.. న‌యా ప్ర‌య‌త్నంలో అటు ద‌ర్శ‌కురాలిగా, ఇటు నిర్మాత‌గా విజ‌యం అందుకుంటుందేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com