Home

»

Latest News

బాబాయ్ ల‌క్కీ డేట్.. అబ్బాయ్ కీ ప్ల‌స్స‌య్యేనా!

Jan 22, 2022 1:35PM

 

హ్యాండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి చాన్నాళ్ళ త‌రువాత మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మూవీతో రాబోతున్నాడు. ఆ సినిమానే.. `భీమ్లా నాయ‌క్`. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి సంద‌డి చేయ‌నున్నాడు రానా. అన్నీ అనుకూలంగా ఉంటే.. ఫిబ్ర‌వ‌రి 25న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లోకి వ‌స్తుంది.

ఇదిలా ఉంటే.. ఫిబ్ర‌వ‌రి 25 రానా బాబాయ్, విక్ట‌రీ వెంక‌టేశ్ కెరీర్ లో ఓ మెమ‌ర‌బుల్ డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. 24 ఏళ్ళ క్రితం అంటే 1998లో ఇదే తేదిన వెంకీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ లో ఒక‌టైన `సూర్య‌వంశం` విడుద‌లైంది. వెంక‌టేశ్ ద్విపాత్రాభిన‌యం చేసిన సద‌రు సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రి.. బాబాయ్ వెంకీకి అచ్చొచ్చిన ఫిబ్ర‌వ‌రి 25.. అబ్బాయ్ రానాకి కూడా ప్ల‌స్ అవుతుందేమో చూడాలి.

Also Read: సురేఖావాణి కూతురు షాకిచ్చింది

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. `భీమ్లా నాయ‌క్` ఎలాగైతే రీమేక్ మూవీనో.. `సూర్య వంశం` కూడా అలాగే రీమేక్ సినిమానే. త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `సూర్య వంశం` సినిమాకి తెలుగు వెర్ష‌న్ గా వెంకీ `సూర్య వంశం` తెర‌కెక్కింది. ఆ కోణం కూడా రానాకి  క‌లిసొస్తుందేమో చూడాలి మ‌రి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com