37 ఏళ్ళ తర్వాత రిలీజ్ కాబోతున్న రజినీకాంత్ మూవీ.. కాస్టింగ్ చూస్తే మైండ్ బ్లాక్
on Jan 23, 2026
.webp)
-ఇంతకీ ఆ సినిమా ఏంటి!
-ఇన్ని రోజులు ఆపింది ఎవరు
-అభిమానులు, ప్రేక్షకులని మెప్పిస్తుందా!
-వాచ్ ది స్టోరీ
ఏవైనా కారణాలతో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)సినిమా రిలీజ్ ఆగిందనుకోండి. స్వయంగా ఫ్యాన్స్ నే రంగంలోకి దిగి తమ స్టైల్ లో పంచాయితీ చేసే పరిస్థితి ఉంటుంది. రజినీ,అభిమానులకి మధ్య ఉన్న అనుబంధానికి ఒక ఉదాహరణ. నిజానికి రజినీ మూవీ రిలీజ్ ఆగిపోదు. ఆపే సాహసం ఎవరు చెయ్యరు. కానీ రజినీ నుంచి రావాల్సిన మూవీ 37 ఏళ్ళ తర్వాత రిలీజ్ కాబోతుంది. ఇది నిజం. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
'హమ్ మేన్ షాహెన్‌షా కౌన్'(Hum Mein Shahenshah Kaun)..యాక్షన్ జోనర్ లో తెరకెక్కగా 1989 వ సంవత్సరంలోనే షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. రజినీకాంత్ తో పాటు శత్రుఘ్నసిన్హా(Shatrughan Sinha)మరో హీరోగా చెయ్యగా రాజా రాయ్(Raja Rai)నిర్మాతగా వ్యవహరించాడు. హర్మేష్ మల్హోత్రా(Harmesh Malhotra)దర్శకుడు. ఆర్థిక పరమైన కారణాలు, సెన్సార్ వంటి సమస్యల వల్ల రిలీజ్ ఆగలేదు. కేవలం టైం బ్యాడ్ అని చెప్పవచ్చు. షూటింగ్ అయిపోయిన తర్వాత రాజా రాయ్ చిన్న కొడుకు లండన్ దేశంలో చనిపోయాడు. దాంతో రాజా రాయ్ తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రిలీజ్ ని పట్టించులేదు.
ఆ తర్వాత కొన్నాళ్లకి రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ దర్శకుడు హర్మేష్ మల్హోత్రా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్లాన్ చేసినా కూడా పలు కారణాలతో రిలీజ్ నోచుకోలేదు. దీంతో మూవీ లవర్స్ కి రజినీ,శత్రుఘ్న ల మేజిక్ ని చూడాలని రాసి పెట్టి ఉండటంతో, ఇప్పుడు 37 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుండగా డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నారు.
Also read: రావడం పక్కా అని ఎప్పుడో చెప్పాను.. ఎన్ని పెరిగాయి!
రజినీ, శత్రుఘ్నసిన్హా తో పాటు హేమమాలిని(Hemamalini)అనితా రాజ్ హీరోయిన్లు గా చేయగా, ప్రేమ్ చోప్రా,అమ్రిష్ పురి, శరత్ సక్సేనా వంటి స్టార్ కాస్టింగ్ స్క్రీన్ షేర్ చేసుకుంది. లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మి కాంత్ ప్యార్ లాల్(Laxmikant Pyarelal)నుంచి సాంగ్స్ రావడం విశేషం. ప్రెజెంట్ టెక్నాలజీ ని ఉపయోగించి సినిమా నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఏ మేర ఆదరణ ని పొందుతుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



