రావడం పక్కా అని ఎప్పుడో చెప్పాను.. ఎన్ని పెరిగాయి!
on Jan 23, 2026

-శర్వానంద్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది
-అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు
-ఇప్పటి వరకు ఎంత
-ఇక్కడ్నుంచి ఎంత!
రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చెప్పిన ఈ క్వెషన్ ఇప్పుడు 'నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari)కి వర్తిస్తుంది. రిలీజ్ రోజు హిట్ టాక్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. దీంతో అభిమానులు, సినీ క్రిటిక్స్ మొదటి ఆట ప్రదర్శించినప్పట్నుంచి చెప్తున్న బ్లాక్ బస్టర్ మాట నిజమైంది.
అందుకు తగ్గట్టే సినీ సర్కిల్స్ లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 'నారీ నారీ నడుమ మురారి' కి థియేటర్స్ పెరిగాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ నే ఇందుకు కారణం. సింగల్ స్క్రీన్స్ తో పాటు మల్టి ప్లెక్స్ ని కూడా భారీగానే యాడ్ చేశారు. దీంతో ఎక్కువ థియేటర్స్ లోకి రావడం పక్కా అని మేకర్స్ చెప్పినట్లయింది. మరి ఈ లెక్కన నారీనారీనడుమ మురారి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడమే ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గౌతమ్ గా శర్వానంద్(Sharwanand),నిత్య, దియా గా సాక్షి వైద్య(sakshi Vaidya),సంయుక్త మీనన్(Samyuktha Menon)ల క్యారక్టరయిజేషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకోవడమే కాకుండా గిలి గింతలు పెడుతున్నాయి.
Also read: చిరంజీవి సినిమా ఆలస్యానికి 'జన నాయగన్’ అడ్డంకి గా మారిందా!
వీరితో పాటు నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, సంపత్, దర్శకుడు రామ్ అబ్బరాజు(Ram Abbaraju),డైలాగ్ రైటర్స్ నందు, భాను కూడా జాయిన్ అయ్యి నారీనారీ నడుమ మురారి స్క్రీన్స్ ని లాఫింగ్ థెరపీ కి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా మార్చుతున్నారు. దీంతో నిర్మాత అనిల్ సుంకర తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ భారీ లాభాల్లో తెలియాడనున్నారు.జనవరి 14 ఈవినింగ్ షో నుంచి థియేటర్స్ లోకి రాగా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రూపాయలని సాధించి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



