Home

»

Latest News

మహానటి కోసం మెగాస్టార్

Jan 25, 2022 8:13PM

'మహానటి' సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌ గా కనిపించనుంది. 

ప్ర‌ముఖ నిర్మాత  దిల్‌రాజు  సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్న ఈ సినిమాకి నగేష్ కుకునూర్ ద‌ర్శ‌కుడు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ సోమవారం విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 

తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిన ఈ మూవీ జ‌న‌వ‌రి 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ కానుంది. ఈ నేపథ్యంలో రేపు(జనవరి 26 న) ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మూవీ టీమ్ గ్రాండ్ గా నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో జరగనున్న ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

కాగా, తమిళ్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్ గా తెరకెక్కుతున్న 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com