Home

»

Latest News

క‌ళ్యాణి టైమ్ మాములుగా లేద‌స‌లు!

Jan 27, 2022 4:06PM

నాలుగేళ్ళ క్రితం విడుద‌లైన `హ‌లో` చిత్రంతో క‌థానాయిక‌గా తొలి అడుగేసింది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన స‌ద‌రు తెలుగు సినిమాతో న‌టిగా ఫ‌ర్లేద‌నిపించుకుంది. ఒక‌ప్ప‌టి క‌థానాయిక‌ లిజి, ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ గారాల ప‌ట్టి అనే ట్యాగ్ లైన్ ఈ కేర‌ళ‌కుట్టికి.. కెరీర్ ఆరంభంలో కొన్ని అవ‌కాశాల‌ను, ఒక‌ట్రెండు హిట్స్ ని క‌ట్ట‌బెట్టినా, ఈ మ‌ధ్య మాత్రం వ‌రుస విజ‌యాల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో మూడు జ‌న‌రంజ‌క చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

Also Read: దేవికి ఆదిత్య ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ ఏంటీ?  

ఆ వివ‌రాల్లోకి వెళితే.. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 25న రిలీజైన త‌మిళ చిత్రం `మానాడు`తో త‌న ఖాతాలో సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసుకున్న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్.. గ‌త వారం విడుద‌లైన మ‌ల‌యాళ సినిమా `హృద‌యం`తో మ‌రో మెమ‌ర‌బుల్ మూవీని, హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. బుధ‌వారం (జ‌న‌వ‌రి 26) నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న మ‌రో మ‌ల‌యాళ చిత్రం `బ్రో డాడీ` కూడా వీక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. `హృద‌యం`లో మోహ‌న్ లాల్ త‌న‌యుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న క‌ళ్యాణి.. `బ్రో డాడీ`లో మోహ‌న్ లాల్ తో పాటు క‌లిసి న‌టించింది. మొత్తంగా.. రెండు నెల‌ల కాలంలో మూడు మెమ‌రబుల్ మూవీస్ ని త‌న అకౌంట్ లో వేసుకున్న క‌ళ్యాణిని చూసి.. అమ్మ‌డి టైమ్ మాములుగా లేద‌స‌లు అంటున్నారు విశ్లేష‌కులు.

Also Read: నా అగ్రిమెంట్లు నాకు ఇచ్చేయండ్రోయ్: నాగ‌బాబు

కొస‌మెరుపు ఏంటంటే.. ఈ మూడు చిత్రాల న‌డుమ డిసెంబ‌ర్ లో విడుద‌లైన మాలీవుడ్ ఎపిక్ డ్రామా `మ‌ర‌క్కార్` మాత్రం బాక్సాఫీస్ ముంగిట మెప్పించ‌లేక‌పోయింది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం క‌ళ్యాణి టైమ్ బాగుంద‌నే చెప్పాలి. మ‌రి.. భ‌విష్య‌త్ లోనూ ఇదే త‌ర‌హాలో మ‌రిన్ని విజ‌యాల‌ను ఈ ముద్దుగుమ్మ‌ క్రెడిట్ చేసుకుంటుందేమో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com