Home

»

Latest News

బెల్లంకొండ బాబుని మించిపోయాడుగా!

Aug 1, 2016 11:52AM

ఎంత భారీ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన కథానాయకుడి నిర్మాత ఎంత పెద్ద బడ్జెట్ ను కేటాయిస్తారు చెప్పండి. మహా అయితే ఓ 20 కోట్లు లేదు మరీ కోటీశ్వరుడైతే ఓ 30 కోట్ల వరకూ ఖర్చు చేస్తారు. కానీ.. తొలి చిత్రానికే 40 కోట్లు ఖర్చు పెట్టించి ఓ రెండేళ్ల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సంచలనం సృష్టించాడు. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వివి.వినాయక్ దర్శకత్వం వహించగా.. బెల్లంకొండ సురేష్ స్వయంగా నిర్మించారు. 

ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలుకొట్టి 30, 40 కాదు ఏకంగా 75 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "జాగ్వార్" అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నాడు నిఖిల్ కుమార్. మాజీ ప్రధానమంత్రి దేవే గౌడా మనవడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు అయిన నిఖిల్ నటిస్తున్న "జాగ్వార్" ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. కంటెంట్ పరంగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు మరియు బాలయ్య "మిత్రుడు" చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన మహదేవ్ ఈ చిత్రానికి నిర్ధేశకత్వం చేస్తున్నాడు. స్వయంగా తండ్రి మరియు ముఖ్యమంత్రి అయిన కుమార్ స్వామి నిర్మిస్తుండడంతో బడ్జెట్ గురించి ఏమాత్రం ఆలోచించలేదట. మరి "అల్లుడుశీను" తరహాలో ఈ "జాగ్వార్" కూడా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగులుతుందో లేక మంచి లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com