Home

»

Latest News

ఏయ‌న్నార్, సావిత్రి ఫ్యామిలీ డ్రామా `తోడి కోడ‌ళ్ళు`కి 65 వ‌సంతాలు!

Jan 11, 2022 1:02PM

న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో ఆదుర్తి సుబ్బారావు ఒక‌రు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ప‌లు చిత్రాలు తెలుగునాట క్లాసిక్స్ గా నిలిచాయి. అలాంటి ఈ ఇరువురు తొలిసారిగా జ‌ట్టుక‌ట్టిన సినిమా `తోడి కోడ‌ళ్ళు`.  ప్ర‌ముఖ బెంగాలీ ర‌చ‌యిత శ‌ర‌త్ చంద్ర ఛ‌టోపాధ్యాయ్ ర‌చించిన `నిష్కృతి` న‌వ‌ల ఆధారంగా ఈ ఫ్యామిలీ డ్రామా రూపొందింది. ఇందులో ఏయ‌న్నార్ కి జంట‌గా మ‌హాన‌టి సావిత్రి న‌టించ‌గా ఎస్వీ రంగారావు, క‌న్నాంబ‌, సూర్య‌కాంతం, రేలంగి, రాజసులోచ‌న‌, జ‌గ్గ‌య్య‌, అల్లు రామ‌లింగ‌య్య ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

Thodi Kodallu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News &  Videos | eTimes

మాస్ట‌ర్ వేణు అందించిన బాణీల‌కు శ్రీ శ్రీ‌, తాపీ ధ‌ర్మారావు, ఆచార్య ఆత్రేయ‌,  కొస‌రాజు సాహిత్య‌మందించారు. ఇందులోని ``ఆడుతూ పాడుతూ``, ``కారులో షికారుకెళ్ళే`` పాటలు చార్ట్ బ‌స్ట‌ర్స్ గా నిల‌వ‌గా, ``ఎంతెంత దూరం``, ``న‌లుగురు క‌లిసి``, ``గాలిప‌టం గాలిప‌టం``, ``క‌ల‌కాలం ఈ క‌ల‌త‌``, ``టౌను ప‌క్క‌కి వెళ్ళొద్దురా``, ``శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు``, ``నీ షోకు చూడ‌కుండా``, ``భ‌లే మావ‌య్య‌`` గీతాలు కూడా రంజింప‌జేశాయి. అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్ ప‌తాకంపై డి. మ‌ధుసూద‌న‌రావు నిర్మించిన ఈ సినిమా.. త‌మిళంలో `ఎంగళ్ వీట్టు మ‌హాల‌క్ష్మి` పేరుతో దాదాపు ఇదే టీమ్ తో రూపొంది అక్క‌డా విజ‌యం సాధించింది. 1957 జ‌న‌వ‌రి 11న సంక్రాంతి కానుక‌గా విడుద‌లై జ‌న‌నీరాజ‌నాలు అందుకున్న `తోడి కోడ‌ళ్ళు`.. నేటితో 65 వ‌సంతాలు పూర్తిచేసుకుంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com