2022 ఫస్టాఫ్ రివ్యూ 9: ఐటమ్ సాంగ్స్ కహానీ!
on Jun 29, 2022

2022 ప్రథమార్ధంలో తెలుగునాట చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రత్యేక గీతాలు కనువిందు చేశాయి. ఆ పాటల వివరాల్లోకి వెళితే..
వాసివాడి తస్సాదియ్యా - బంగార్రాజు:
`జాతిరత్నాలు`లో చిట్టిగా ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా.. ఈ ఏడాది సంక్రాంతి విజేత అయిన `బంగార్రాజు` కోసం ఫస్ట్ టైమ్ ఐటమ్ గాళ్ అవతారమెత్తింది. కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్యతో కలిసి ``వాసివాడి తస్సాదియ్యా`` అంటూ ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి ఇంప్రెస్ చేసింది. ఇక ఇదే సినిమాలో మీనాక్షి దీక్షిత్, వేదిక, దర్శన బానిక్, దక్ష కూడా స్పెషల్ సాంగ్స్ లో మెరిశారు.
కొడితే - గని:
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన `గని`లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఓ ప్రత్యేక గీతం కోసం మెరిసింది. ``కొడితే`` అంటూ సాగే ఈ పాటలో తన శైలి విన్యాసాలతో కవ్వించింది.
శానా కష్టం - ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` కోసం తొలిసారిగా ఐటమ్ గాళ్ అవతారమెత్తింది రెజీనా. ``శానా కష్టమొచ్చింది మందాకిని`` అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది ఈ హాట్ బ్యూటీ.
లైఫ్ అంటే ఇట్టా ఉండాలా - ఎఫ్ 3:
ఆ మధ్య ``జిల్ జిల్ జిగేల్ రాణి`` అంటూ `రంగస్థలం`లో రంజింపజేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. `ఎఫ్ 3` కోసం మరోమారు స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ``అధ్యక్షా.. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా`` అంటూ సాగే గీతంలో సందడి చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



