Home

»

Latest News

20 వ‌సంతాల `ఓ చిన‌దాన`!

Jan 25, 2022 1:08PM

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రూపొందించిన `ఆనంద్` (2004)తో మంచి కాఫీ లాంటి క‌థానాయ‌కుడిగా గుర్తింపు పొందారు రాజా. అయితే, ఆ సినిమా కంటే ముందు ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి అల‌రించాడు రాజా. మ‌రీముఖ్యంగా.. అత‌ని ప‌రిచ‌య చిత్రంగా రూపొందిన `ఓ చిన‌దాన‌` చెప్పుకోద‌గ్గ విజ‌యం చూసింది. మైటీ స్టార్ శ్రీ‌కాంత్ మెయిన్ లీడ్ గా న‌టించిన ఈ సినిమాలో సెకండ్ హీరోగా ఎంట‌ర్టైన్ చేశాడు రాజా. ప్రేమంటే గిట్ట‌ని ఓ అమ్మాయిలో ప్రేమ భావ‌న‌లు క‌లిగించ‌డానికి ఓ యువ జంట చేసిన ప్ర‌య‌త్న‌మే `ఓ చిన‌దాన‌` చిత్రం. ఇందులో శ్రీ‌కాంత్ కి జంట‌గా శ్రుతి రాజ్ క‌నిపించ‌గా, రాజాకి జోడీగా గ‌జాలా ఆడిపాడింది. వినోదాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు ఇ. స‌త్తిబాబు తెర‌కెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా.. హాలీవుడ్ మూవీ `10 థింగ్స్ ఐ హేట్ ఎబౌట్ యు` (1999) స్ఫూర్తితో రూపొందింది.

Also read: బాల‌య్య‌తో గీతా ఆర్ట్స్ కాప్ డ్రామా.. స్టోరీ లైన్ ఇదేనంటూ ప్ర‌చారం!?

దిగ్గ‌జ గీత‌ర‌చ‌యిత `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి క‌లం నుంచి జాలువారిన పాట‌ల‌కు విద్యాసాగ‌ర్ బాణీలు క‌ట్టారు. ఇందులోని టైటిల్ సాంగ్ (దేవాశిష్ గానం)తో పాటు ``ధింధింతార ధింధింతార‌`` (బాలు, ఉమా రామ‌న‌న్ గానం) అంటూ సాగే పాట సంగీత ప్రియుల‌ను ఆక‌ట్టుకుంది. రాజేశ్వ‌రి ఫిల్మ్స్ ప‌తాకంపై ముళ్ళ‌పూడి బ్ర‌హ్మానందం ఈ సినిమాని నిర్మించారు. 2002 జ‌న‌వ‌రి 25న విడుద‌లై అల‌రించిన `ఓ చిన‌దాన‌`.. నేటితో 20 వ‌సంతాలు పూర్తిచేసుకుంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com