Home

»

Latest News

బాల‌య్య‌తో గీతా ఆర్ట్స్ కాప్ డ్రామా.. స్టోరీ లైన్ ఇదేనంటూ ప్ర‌చారం!?

Jan 24, 2022 10:38AM

 

కాప్ డ్రామాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన టాలీవుడ్ స్టార్స్ లో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. `ఇన్ స్పెక్ట‌ర్ ప్ర‌తాప్` (1988), `రౌడీ ఇన్ స్పెక్ట‌ర్` (1992), `చెన్న‌కేశ‌వ రెడ్డి` (2002), `ల‌క్ష్మీ న‌ర‌సింహా` (2004) వంటి సినిమాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా ఆక‌ట్టుకున్నారు బాల‌య్య‌.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో బాల‌య్య మ‌రోసారి ఖాకీ ధ‌రించ‌నున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `అన్ స్టాప‌బుల్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ షో అనంత‌రం బాల‌కృష్ణ‌తో ఓ సినిమాని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `బింబిసార‌` ఫేమ్ వ‌శిష్ఠ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. ఈ సినిమా స్టోరీలైన్ కి సంబంధించి కూడా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేమిటంటే.. ఆరు నెల‌ల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ప్ర‌భుత్వ అధికారుల‌ను బ‌దిలీ చేయ‌కూడ‌దు. ఈ నిబంధ‌న‌ని ఆస‌రాగా చేసుకుని ఓ పోలీస్ అధికారి.. రౌడీయిజాన్ని, అవినీతిని ఎలా ఎదుర్కొన్నాడ‌నే పాయింట్ తో ఈ చిత్రం రూపొంద‌నుంద‌ట‌. మ‌రి.. బాల‌య్య - అల్లు అర‌వింద్ కాంబో మూవీపై వ‌స్తున్న క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

Also Read: 'లైగ‌ర్‌'తోనూ సామ్ చిందులు?

కాగా, బాల‌య్య ప్ర‌స్తుతం `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తున్నారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్ట‌నున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com