Home

»

Latest News

త‌రుణ్, ఆర్తి అగ‌ర్వాల్ ప్రేమ‌క‌థ `నువ్వు లేక నేను లేను`కి 20 ఏళ్ళు!

Jan 13, 2022 12:50PM

సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ కి, సంక్రాంతి సీజ‌న్ కి మంచి అనుబంధ‌మే ఉంది. ముగ్గుల పండ‌గ త‌రుణంలో సురేశ్ సంస్థ నుంచి సంద‌డి చేసిన ప‌లు చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. వాటిలో `నువ్వు లేక నేను లేను` ఒక‌టి. ప్ర‌స్తుతం బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతున్న కాశీ విశ్వ‌నాథ్ ఈ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. అప్ప‌ట్లో యువ‌త‌రంలో మంచి ఫాలోయింగ్ ఉన్న త‌రుణ్, ఆర్తి అగ‌ర్వాల్ ఈ ప్రేమ‌క‌థా చిత్రం కోసం తొలిసారిగా జోడీక‌ట్టారు. చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసి పెరిగిన రాధాకృష్ణ (త‌రుణ్), కృష్ణ‌వేణి (ఆర్తి అగ‌ర్వాల్) చివ‌ర‌కి ఎలా జంట అయ్యారు? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది.

Also Read:  ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు.. ప్రేక్షకులను అవమానించింది!

ల‌య‌, కిర‌ణ్ రాథోడ్, కె. విశ్వ‌నాథ్, సునీల్, బ్ర‌హ్మానందం, చంద్ర‌మోహ‌న్, శ‌ర‌త్ బాబు, ఎమ్మెస్ నారాయ‌ణ‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప్ర‌గ‌తి, సుధ‌, ల‌క్ష్మీప‌తి, చిత్రం శ్రీ‌ను ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ కి ఆర్పీ ప‌ట్నాయ‌క్ అందించిన బాణీలు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ``ఏదో ఏదో``, ``ఎలా ఎలా``, ``నిండు గోదారి క‌దా ఈ ప్రేమ‌``, ``నువ్వంటే నాకిష్టం``, `చిన్ని చిన్ని``, ``ఛీ ఛీ``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ రంజింప‌జేశాయి. సంక్రాంతి కానుక‌గా 2002 జ‌న‌వ‌రి 14న విడుద‌లై మంచి విజ‌యం సాధించిన `నువ్వు లేక నేను లేను`.. శుక్ర‌వారంతో 20 వ‌సంతాలు పూర్తిచేసుకుంటోంది. 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com