Home

»

Latest News

రెండు రోజుల్లో 1.6 cr వసూలు చేసిన సిద్ధార్థ్ 180

Jun 28, 2011 12:50PM

రెండు రోజుల్లో 1.6 cr వసూలు చేసిన సిద్ధార్థ్ "180". క్యాప్షన్ "ఈ వయసిక రాదు". వివరాల్లోకి వెళితే సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా, జయేంద్ర దర్శకత్వంలో, సత్యం సినిమా అఘళ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "180". ఈ సిద్ధార్థ్ "180" సినిమా ఇటీవల విడుదలైంది. విడుదలైన రెండురోజుల్లో అంటే శని, ఆదివారాల్లో ఈ సిద్ధార్థ్ "180" సినిమా వసూలు చేసిన మొత్తం 1.6 cr అని తెలిసింది. నిజానికి సిద్ధార్థ్ "180" విడుదల కాగానే "ఎ" సెంటర్లలో బాగానే ఉంది కానీ "బి, సి" సెంటర్లలో ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది.

దానికి కారణం మాస్ కి కావలసిన కమర్షియల్ హంగులేవీ ఈ చిత్రంలో లేకపోవటమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా గురించి రివ్యూలు కూడా అంత ప్రోత్సాహకరంగా లేవు. సిద్ధార్థ్ "180" ఆంధ్రా మొత్తం 1.6 cr వసూలు చేయగా, ఒక్క నైజాం ఏరియాలోనే దాదాపు అందులో సగం అంటే 75 లక్షలు వసూలు చేయటం విశేషం. సిద్ధార్థ్ "180" సినిమాకి వనమాలి పాటలను వ్రాయగా, శరత్ సంగీతాన్ని, బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని నిర్వహించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com