Home

»

Latest News

నాగచైతన్య కొత్త మూవీ "100% లవ్"

Mar 21, 2011 10:35AM

nagachaitanya stills, nagachaitanya images, nagachaitanya pics, nagachaitanya photos, nagachaitanya pictures, nagachaitanya wallpapers యువ హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త మూవీకి "100% లవ్" అన్న పేరుని ఖరారు చేశారు. వివరాల్లోకి వెళితే నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రానికి "100% లవ్" అన్న పేరుని నిర్ణయించటం జరిగింది. నాగచైతన్య కొత్త మూవీ "100% లవ్"లో మరో హీరో"రోజా పూలు" చిత్రం ఫేం శ్రీరామ్ కూడా నటిస్తున్నారు. శ్రీరామ్ ఈ చిత్రంలో నాగచైతన్యకు అన్నయ్యగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఆడియో మార్చ్ నెలాఖరు వారంలో విడుదల చేస్తారని సమాచారం. నాగచైతన్య జోష్, ఏమాయ చేశావె రెండు చిత్రాల తర్వాత నటిస్తున్న మూడవ చిత్రం ఈ "100% లవ్". ఈ "100% లవ్" దర్శకుడు సుకుమార్ కి కూడా కచ్చితంగా ప్రస్తుతం ఒక హిట్ కావాలి. కనుక నిర్మాత అల్లు అరవింద్ కి నచ్చిన కథతో నిర్మిస్తున్న ఈ చిత్రం మీద సినీ పరిశ్రమలో అంచనాలు భారీగానే ఉన్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com