Home

»

Latest News

2022 ఫ‌స్టాఫ్ రివ్యూ 10:  జ‌న‌వ‌రి - జూన్ హిట్స్ ఇవే!

Jun 30, 2022 10:42AM

స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్, డ‌బ్బింగ్ పిక్చ‌ర్స్ .. ఇలా విభాగం ఏదైనా 2022 ప్ర‌థ‌మార్ధంలో తెలుగునాట ప్ర‌తీ నెల‌లోనూ విజ‌యాలు న‌మోద‌య్యాయి. నెల‌ల వారిగా స‌క్సెస్ అయిన ఆ చిత్రాల వివ‌రాల్లోకి వెళితే..

జ‌న‌వ‌రిః

2022 జ‌న‌వ‌రిలో కాసుల వ‌ర్షం కురిపించిన చిత్రం `బంగార్రాజు`. 2016 నాటి `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి ముఖ్య పాత్ర‌లు పోషించారు. క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. జ‌న‌వ‌రి 14న ఈ విలేజ్ డ్రామా తెర‌పైకి వ‌చ్చింది.

ఫిబ్ర‌వ‌రిః

ఫిబ్ర‌వ‌రి నెల‌లో రెండు విజ‌యాలు న‌మోద‌య్యాయి. ఆ చిత్రాలే.. `డీజే టిల్లు`, `భీమ్లా నాయ‌క్`. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన `డీజే టిల్లు`లో సిద్ధు జొన్న‌లగ‌డ్డ టైటిల్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేయ‌గా..  ఫిబ్ర‌వ‌రి 25న సందడి చేసిన `భీమ్లా నాయ‌క్`లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ రోల్ లో క‌నిపించారు. ఈ రెండు సినిమాల‌నూ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించ‌డం విశేషం.

మార్చిః

మార్చి నెల‌లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన సినిమా `ఆర్ ఆర్ ఆర్`. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబోలో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ మ‌ల్టిస్టారర్.. మార్చి 25న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజై ప‌లు రికార్డులు సృష్టించింది.

ఏప్రిల్ః

ఏప్రిల్ నెల విష‌యానికి వ‌స్తే.. ఈ నెల‌లో ఓ క‌న్న‌డ డ‌బ్బింగ్ మూవీ స‌క్సెస్ బాట ప‌ట్టింది. అదే.. `కేజీఎఫ్ః ఛాప్ట‌ర్ 2`. `కేజీఎఫ్` (2018) సీక్వెల్ గా వ‌చ్చిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. ఏప్రిల్ 14న రిలీజై ప‌లు రికార్డులు క్రియేట్ చేసింది. య‌శ్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ రూపొందించాడు.

మేః

మే నెల విష‌యానికి వ‌స్తే.. మూడు విజ‌యాలు న‌మోద‌య్యాయి. మే 12న మ‌హేశ్ బాబు న‌టించిన `స‌ర్కారు వారి పాట‌`, మే 13న శివ‌కార్తికేయ‌న్ త‌మిళ్ డ‌బ్బింగ్ మూవీ `డాన్`, మే 27న వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ మ‌ల్టిస్టార‌ర్ `ఎఫ్ 3` విడుద‌లై.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేశాయి.

జూన్ః

జూన్ నెల‌లో ఒకే తేదిన విడుద‌లైన రెండు చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. ఆ సినిమాలే.. `మేజ‌ర్`, `విక్ర‌మ్`. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ రోల్ లో న‌టించిన త‌మిళ అనువాదం `విక్ర‌మ్` జూన్ 3న విడుద‌ల కాగా, అదే రోజున అడివి శేష్ న‌టించిన `మేజ‌ర్` కూడా జ‌నం ముందు నిలిచింది.

మ‌రి.. 2022 ప్ర‌థ‌మార్ధం లాగే  2022 ద్వితీయార్ధంలో కూడా ప్ర‌తీ నెల‌లోనూ విజ‌యాలు న‌మోద‌వుతాయేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com