![]() |
![]() |

తెలుగు నవలా ప్రపంచంలో చలం రాసిన 'మైదానం' ఒక సంచలనం. తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిలింగా నేషనల్ అవార్డు అందుకున్న '1940లో ఒక గ్రామం' తీసిన నరసింహ నంది, 'మైదానం' నవల ఆధారంగా 'లజ్జ' సినిమా తీశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... 'మైదానం' మీద ఒక వెబ్ సిరీస్ వస్తోంది.
'నీదీ నాదీ ఒకే కథ'తో దర్శకుడిగా పరిచయమైన యువ కవి వేణు ఊడుగుల. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రానా, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ ప్రధాన పాత్రధారులుగా 'విరాటపర్వం' తెరకెక్కిస్తున్నాడు.
చలం 'మైదానం' ఆధారంగా ఒక వెబ్ సిరీస్ నిర్మించనున్నట్టు యువ దర్శకుడు వేణు ఊడుగుల తెలిపాడు. దాంతో కవి సిద్ధార్థను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. హీరోయిన్ రోల్ కోసం స్టార్ హీరోయిన్లతో చర్చలు జరుపుతున్నారట. ఈ వెబ్ సిరీస్‌కి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న 'ఆహా' ఓటీటీ కోసం దీనిని చేస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వేణు ఊడుగుల తెలిపాడు.
![]() |
![]() |