![]() |
![]() |

'మీరు కచ్చితంగా ఏదో ఒక రోజు కలిసి నటించాలని కోరుకుంటున్న బాలీవుడ్ యాక్టర్ ఎవరు?'
- 'సాహో' విడుదల సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి బాలీవుడ్ మీడియా నుండి ఎదురైన ప్రశ్నలలో ఇదొకటి. అప్పుడు ప్రభాస్ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?
"చాలామంది బాలీవుడ్ నటీనటులతో కలిసి నేను నటించాలని అనుకుంటున్నాను. దీపికా పదుకొనే, అలియా భట్... వీళ్ళిద్దరితో ఏదో ఒక రోజు కలిసి నటించాలని కోరుకుంటున్నా"
- ఇదీ ప్రభాస్ ఆన్సర్.
కట్ చేస్తే... ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేయనున్న సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేను సెలెక్ట్ చేశారు. బహుశా... అప్పుడు ప్రభాస్ చెప్పిన ఆన్సర్ నాగ్ అశ్విన్‌కి గట్టిగా వినపడినట్టు ఉంది. తన సినిమాలో దీపికను తీసుకున్నాడు. దాంతో ప్రభాస్ కోరిక తీరుతోంది.
ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చేస్తున్నాడు ప్రభాస్. ఆ తరవాత నాగ్ అశ్విన్ సినిమా ఉంటుంది. ఆ తరవాత చేయబోయే సినిమాకు ఎవరిపైన అలియాను సెలెక్ట్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |