![]() |
![]() |

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో వెలుగులోకి వచ్చిన హీరో నవీన్ పోలిశెట్టి. అతడితో పాటు ప్రముఖ యువ హాస్యనటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'జాతి రత్నాలు'. వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ స్వప్న సినిమా పతాకంపై 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్, స్వప్నా దత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'పిట్టగోడ' ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు బ్యాలన్స్ ఉందంతే. ఈ సినిమాకు ఓటీటీ నుండి ఆఫర్ వచ్చిందట. అయితే, సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని యూనిట్ అనుకుంటున్నదట.
'జాతి రత్నాలు' కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో సన్నివేశాలను థియేటర్లలో చూస్తేనే మజా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకని, కరోనా క్రైసిస్ తగ్గిన తరవాత సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామని ఓటీటీ ఆఫర్లను వద్దనుకున్నారట. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో నవీన్ పోలిశెట్టికి ప్రేక్షకులలో చక్కటి గుర్తింపు లభించింది. అందుకు తగ్గట్టు సినిమా ఉంటుందట.
![]() |
![]() |