![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ఓ భారీ సినిమా ప్రొడ్యూస్ చేయనున్న సంగతి తెలిసిందే. 'రాధే శ్యామ్' పూర్తయిన తరవాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రోజే ప్రభాస్ జోడీగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకోనేను ఎంపిక చేసిన విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించగా, ఈ సినిమా చేయడానికి ఉద్వేగంగా ఎదురు చూస్తున్నట్లు దీపిక ట్వీట్ చేసింది.
ప్రజెంట్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ చేయనున్నారని టాక్. ప్రజెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయట. ప్రభాస్ హీరోగా నటించిన 'ఛత్రపతి'కి కీరవాణి మ్యూజిక్ చేశారు. 'బాహుబలి' గురించి చెప్పక్కర్లేదు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో రికార్డులు సృష్టించిన ఆ సినిమా తరవాత మరోసారి ప్రభాస్, కీరవాణి కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో క్రేజ్ కూడా ఉంటుంది.
పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ సినిమా అని నాగ్ అశ్విన్ చెప్పడంతో ప్రభాస్21 మీద రోజు రోజుకి ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా హీరోయిన్, యాక్టర్స్, ఇతర టెక్నీషియన్ల గురించి తెలుసుకోవాలని ప్రభాస్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
![]() |
![]() |