![]() |
![]() |

రామ్ గోపాల్ వర్మకి కొత్త ఐడియా వచ్చింది. ట్విట్టర్ పిట్ట కూత ద్వారా దర్శకధీరుడు రాజమౌళికి ఐడియా చేరవేశారు. ఇంతకీ, రాజమౌళి చూశారో? లేదో? ఆ ఐడియా గురించి ఆలోచించారో? లేదో? అదేంటంటే... 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌ను యుట్యూబ్‌లో అందరూ ఫ్రీగా చూసేలా రిలీజ్ చేయకుండా, 'పే పర్ వ్యూ' మోడల్‌లో రిలీజ్ చేయమని వర్మ ఉచిత సలహా ఇచ్చిపడేశారు. ట్రైలర్ చూడాలని అనుకున్నవాళ్ళ దగ్గర నుండి 150 రూపాయలు లేదా 200 రూపాయలు వసూలు చేయొచ్చని చెప్పుకొచ్చారు.
గత సార్వత్రిక ఎన్నికల పవన్ కళ్యాణ్ పరాజయాన్ని వర్మ క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల తరవాత అంటూ ఓటీటీ కోసం 'పవర్ స్టార్' సినిమా తెరకెక్కిస్తున్నారు. పవన్ డూప్ పెట్టి ఫ్రీ పబ్లిసిటీ పొందుతున్నారు. సినిమా కోసం కాదు, ట్రైలర్ చూడటానికి వర్మ ఓ రేట్ డిసైడ్ చేశారు. 'పవర్ స్టార్' ట్రయిలర్ చూడాలని అనుకున్నవాళ్ళు 25 రూపాయలు కట్టాలి. అందుకని, రాజమౌళిని కూడా 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌కి టికెట్ పెట్టమని వర్మ సలహా ఇచ్చారు.
'బాహుబలి 2' చూసిన వాళ్ళు అందరూ 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూడటానికి డబ్బులు పే చేస్తారనీ, అప్పుడు నిర్మాతకు ట్రైలర్ టికెట్స్ ద్వారా బడ్జెట్ మొత్తం వస్తుందని వర్మ చెబుతున్నారు.
![]() |
![]() |