![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న మృతి చెందాడు. ఆ నటుడు ఉరివేసుకొని చనిపోవడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు షాక్‌కు గురయ్యారు. ఆయన ఆత్మహత్యకు కారణాలేమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ దర్యాప్తులో భాగంగా డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ, సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, మరికొంతమందిని ప్రశ్నించారు. కాగా, తాజాగా సుశాంత్‌పై ఓ సినిమా రానున్నట్లు ప్రకటన వెలువడింది.
ఆత్మహత్య చేసుకోవాలనే సుశాంత్ తీవ్ర నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సబ్జెక్ట్‌పై తాను ఓ సినిమా తీయనున్నట్లు నిర్మాత విజయ్ శేఖర్ తెలిపారు. ఆ సినిమా పేరు 'సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాజ్ లాస్ట్'.
ఇటీవల ఇంటర్నెట్‌లో సుశాంత్‌సింగ్ లాగా ఉన్న వ్యక్తి ఫొటోలు వైరల్ అవడం గుర్తుందిగా? అవును, ఆ టిక్‌టాక్ స్టార్.. సచిన్ తివారీ. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్‌ను చేయడానికి అతడినే తీసుకున్నాడు విజయ్ శేఖర్. ఇది సుశాంత్ బయోపిక్ కాదు, కానీ ఆయన మృతి ఆధారంగా తీస్తున్న సినిమా అని ఆయన క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ మధ్యలో 'సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాజ్ లాస్ట్' మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ ఏడాది క్రిస్మస్‌కే ఈ సినిమాని రిలీజ్ చేస్తానని నిర్మాత అంటున్నారు.
![]() |
![]() |