![]() |
![]() |

టీవీ సీరియళ్లు, షోలు... షూటింగులు చేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఇన్సూరెన్స్ చేయించాలి.
షూటింగ్ స్పాట్‌ని తరచూ శానిటైజ్ చేయాలి.
తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో షూటింగ్ చేయాలి.
జ్వరం, దగ్గు, జలుబు ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులను షూటింగులకు రానివ్వకూడదు.
ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టెలివిజన్ పెద్దలు నిర్ణయించారు. ఓ టీవీ నటుడిగా కరోనా రావడంతో బుల్లితెర నిర్మాతల మండలి, బుల్లితెర నటీనటుల సంఘం, కార్మికుల సమాఖ్య ప్రత్యేకంగా సమావేశం అయ్యాయి. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో, ఓ నటుడికి కరోనా రావడంతో షూటింగులు చేయడానికి తీసుకోవాలిసిన జాగ్రత్తల గురించి చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. అందులో ముఖ్యమైన నిర్ణయాలు పైన తెలిపినవి.
టీవీ నటుడికి కరోనా రావడంతో షూటింగులను నిలిపివేశారు. రెండు రోజుల విరామం తరవాత మళ్లీ శుక్రవారం నుండి చిత్రీకరణలు ప్రారంభించనున్నారు.
![]() |
![]() |