![]() |
![]() |

అమెరికన్ మోడల్, టీవీ స్టార్ కైలీ జెన్నర్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫొటోలు పోస్ట్ చేశారు. అందులో టూపీస్ బికినీ వేసుకుని కనిపించారు. చూడటానికి రెండు ముక్కలే కావచ్చు. కానీ, దాని రేటు మాత్రం యమా ఘాటుగా ఉంది. కైలీ జెన్నర్ బికినీ ఖరీదు అక్షరాల 1100 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో 83 వేల రూపాయలు. గుచ్చి కంపెనీ బ్రాండ్ బికినీ అది. ఫ్యాషన్ ప్రపంచంలో గుచ్చికి పెద్ద పేరుంది. ఆ కంపెనీ బ్యాగులు, దస్తులు, బెల్టులు వేసుకోవడం ప్రెస్టేజీగా సెలబ్రిటీలు ఫీలవుతారు.
కెలీ జెన్నర్ ఎప్పటికప్పుడు ఫ్యాషన్ పరంగా అప్‌డేట్ అవుతుంటుంది. జస్ట్ 22 ఏళ్ల ఈ అమ్మాయికి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఆమె ఫ్యాషన్, స్టైల్స్ ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తారు. లెటెస్ట్‌గా కైలీ పోస్ట్ చేసిన బికినీ ఫొటోలు చూసి, రేటు ఎంత ఉంటుందో అని చెక్ చేసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. దిమ్మ తిరిగింది. బికినీకి 83 వేలు పోయడం ఎందుకని కామ్‌గా కూర్చున్నారు. లాక్‌డౌన్‌లో కైలీ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. తన కుమార్తెతో కలిసి ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు.
![]() |
![]() |