![]() |
![]() |

కరోనా సౌండ్ వింటే బాలీవుడ్ భయపడుతోంది. కొవిడ్–19 సోకడం వల్ల సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతి చెందడం... కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని నిర్మాత కరీమ్ మొరానీ, ఆయన కుమార్తె, నటి జోయా మోరానీ బయటపడడం... జాన్వీ కపూర్, కరణ్ జోహార్ తదితరుల ఇళ్లలో పని చేసే వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడటంతో ఎవరికి అనారోగ్యం వచ్చినా ముంబై కలవరపడుతోంది.
వెటరన్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ హాస్పటల్‌లో ఉన్నారని తెలియగానే బాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కిపడింది. అందులోనూ ఆమెకు బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయని తెలియడంతో మరింత భయపడింది. అయితే, ఆమెకు కొవిడ్–19 టెస్ట్ చేయగా రిజల్ట్‌లో కరోనా లేదని రావడంతో ఊపిరి తీసుకుంది. వయసు రీత్యా బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందట. రెండు మూడు రోజుల్లో సరోజ్ ఖాన్‌ను ఇంటికి పంపిస్తారట. ఆమె వెంట భర్త రాజు ఖాన్ ఉన్నారు.
![]() |
![]() |