![]() |
![]() |

డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ 5 సహా మిగతా ఓటీటీలకు పోటీ ఇవ్వడానికి 'ఆహా' గట్టిగా ప్రయత్నిస్తోంది. స్టార్ దర్శకులు, హీరోయిన్లతో షోస్, సిరీస్ చేయడానికి మెగా నిర్మాత అల్లు అరవింద్ అండదండలు పుష్కలంగా ఉన్న అచ్చ తెలుగు ఓటీటీ పావులు కదుపుతోంది. తమన్నా, పాయల్ రాజ్‌పుత్‌లతో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చేయడానికి రెడీ అవుతోంది. అలాగే, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సిరీస్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట.
'పటాస్'తో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్స్ తో విజయాలతో అందుకున్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తీసిన 'ఎఫ్ 2'తో కామెడీ సినిమాలకు 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే సత్తా ఉందని నిరూపించారు. 'సరిలేరు నీకెవ్వరు'తో మరో భారీ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడితో 'ఎఫ్ 2' టైప్ కామెడీ సిరీస్ తీయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం 'ఎఫ్ 2' సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన ఈ దర్శకుడు, మరో హీరో కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడు. అన్నీ కుదిరితే ఆహా కోసం వెబ్ సిరీస్ చేస్తాడు.
![]() |
![]() |