![]() |
![]() |

అటు ప్రపంచానికి, ఇటు భారతీయ చిత్ర పరిశ్రమకు ఇప్పటివరకు 2020 ఏమాత్రం కలిసి రాలేదు. ఓ వైపు కరోనా వల్ల చిత్రీకరణలు నిలిచిపోవడంతో సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతోంది. మరోవైపు వరుస మరణాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, వాజిద్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పైలోకాలకు వెళ్లారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు మృతి చెందారు.
త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు రెడీ అవుతున్న 'ముంబై డైరీస్ 26/11'లో నటించిన తేజస్ అనే యువ నటుడు మృతి చెందాడు. అతడి వయసు 41 సంవత్సరాలే. సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్లు అంటే పెద్ద వయసు కాదు. ఎంతో భవిష్యత్తు ఉంటుంది. 2012లో విడుదలైన 'ముంబై చ రాజా' సినిమాలో తన నటనతో తేజస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తరవాత భారీగా అవకాశాలు రాలేదు. తరవాత రెండు మూడు సినిమాలు చేశాడు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'దుబాయ్ రిటర్న్'కి కాస్టింగ్ దర్శకుడిగానూ పని చేశాడు. అతడి మృతి పట్ల 'ముంబై డైరీస్ 26/11'లో నటించిన సత్యజిత్ దూబే తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.
![]() |
![]() |