![]() |
![]() |

‘వి’.. యువ కథానాయకుడు నానికి వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఎందుకంటే.. ఈ సినిమాతోనే పాతిక చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు నాని. అంతేకాదు.. తన తొలిచిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో ఈ మైల్ స్టోన్ మూవీ చేయడం కూడా నానికి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమాని మార్చి 25న విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. మళ్ళీ.. థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. ‘వి’ విజయం సాధిస్తే నాని ఖాతాలో మూడు 'హ్యాట్రిక్'లు నమోదైనట్టే. ఆ వివరాల్లోకి వెళితే.. ‘అష్టా చమ్మా’ (2008), ‘జెంటిల్‌మన్’ (2016) తరువాత నాని, ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘వి’ హిట్టయితే.. ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ ఖాతాలో హ్యాట్రిక్ జమ అయినట్టే. అలాగే.. ‘నేను లోకల్’ (2017), ‘ఎం.సి.ఎ.' (మిడిల్ క్లాస్ అబ్బాయ్) (2017) అనంతరం నాని, నిర్మాత ‘దిల్’ రాజు కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అయిన ‘వి’.. గత రెండు చిత్రాల తరహాలోనే విజయం సాధిస్తే వీరి కాంబినేషన్‌కి హ్యాట్రిక్ తోడవుతుంది. అదే విధంగా.. ‘జెంటిల్‌మన్’(2016), ‘నిన్ను కోరి’(2017) వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నాని, కథానాయిక నివేదా థామస్ కలసి నటించిన మూడో సినిమా ‘వి’. సో.. ఈ రకంగానూ మరో హ్యాట్రిక్ వెయిట్ చేస్తున్నట్టే.
మరి.. ఇంద్రగంటి మోహనకృష్ణ, ‘దిల్’ రాజు, నివేదా థామస్ - ఇలా ఈ ముగ్గురి కాంబినేషన్‌లో నానికి వేర్వేరు హ్యాట్రిక్స్ దక్కుతాయో లేదో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
‘వి’లో నాని ప్రతినాయకుడి పాత్రలో నటించగా.. సుధీర్ బాబు కథానాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. నివేదా థామస్‌తో పాటు అదితిరావ్ హైదరి మరో నాయికగా దర్శనమివ్వనుంది. అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి తమన్ నేపథ్య సంగీతం అందించాడు.
![]() |
![]() |