![]() |
![]() |

త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్‌స్టర్స్, స్టార్ హీరోలు కోరుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే, ఓసారి పని చేసిన హీరోతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడం మాటల మాంత్రికుడి శైలి. పవన్ కల్యాణ్‌తో మూడు, బన్నీతో మూడు, మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
'అల వైకుంఠపురములో' విజయం తరవాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఖరారు అయింది. తారక్ 30వ సినిమాకి ఆయన దర్శకత్వం వహించనున్నారు. ఆ సినిమా తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల రెండుమూడుసార్లు రామ్ చరణ్, త్రివిక్రమ్ సమావేశమయ్యారు. సినిమా గురించి డిస్కస్ చేసుకున్నారని టాక్.
నిజానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయాలనుకున్నారు. ఓ సినిమా వేడుకలో ఆ విషయం చెప్పారు కూడా! అయితే, ప్రస్తుతం చిరంజీవి లైనప్ మారింది. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' తరవాత 'లూసిఫర్' రీమేక్ చేయాలనుకుంటున్నారు. మెహర్ రమేష్, బాబీతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అందువల్ల త్రివిక్రమ్, చరణ్ కాంబినేషన్ సెట్ అవుతుందన్నమాట.
![]() |
![]() |