![]() |
![]() |
.jpg)
అల్లరి నరేశ్ డబుల్ రోల్ పోషించిన 'జంప్ జిలానీ' సినిమా 2014లో వచ్చింది. ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్లుగా నటించారు. ఇది 2012లో తమిళంలో వచ్చిన హిట్ ఫిల్మ్ 'కలకలప్పు'కు రీమేక్. గమనించాల్సిన విషయమేమంటే ఒరిజినల్‌లో విమల్, శివ హీరోలుగా నటించారు. అంటే అక్కడ ఇద్దరు హీరోలు చేసిన పాత్రల్ని తెలుగు రీమేక్‌లో నరేశ్ ఒక్కడే డ్యూయల్ రోల్‌గా చేశాడు. ఈ మార్పు ఎందుకు జరిగింది?
దీనికి సమాధానం.. రెండో హీరో క్యారెక్టర్‌ను చేయడానికి ఏ హీరో ముందుకు రాకపోవడం! అవును. ఈ విషయాన్ని స్వయంగా నరేశ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. "జంప్ జిలానిలో డ్యూయల్ రోల్ కావాలని చేసింది కాదు. తప్పక చేయాల్సి వచ్చింది. నిజానికి తమిళ ఒరిజినల్‌లో ఇద్దరు హీరోలుంటారు. తెలుగులో కూడా ఇద్దరు హీరోలు ఉండాలని చాలామందిని అడిగి చూశాం కానీ క్యారెక్టర్ల ప్రయార్టీని దృష్టిలో పెట్టుకొని నటించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అనూహ్యంగా ఆ ఇద్దరు హీరోల క్యారెక్టర్లను డ్యూయల్ రోల్‌గా మార్చాల్సి వచ్చింది" అని ఆయన చెప్పాడు. అదీ విషయం! అయితే బాక్సాఫీస్ దగ్గర 'జంప్ జిలాని' ఆశించిన రీతిలో ఆడలేదు.
![]() |
![]() |